Tuesday, 21 October 2025

కేదారేశ్వర వ్రతం

కేదారేశ్వర వ్రతం – కేదార గౌరీ పూజ విధానం* 
*21-10-2025 మంగళవారం*
---------------------------------------- 
*కేదార గౌరీ వ్రతం లేదా కేదార వ్రతం అనేది శివుని భక్తులకు ఒక ముఖ్య మైన ఉపవాస ఆచారం, సాధారణంగా భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా తమిళనాడులో పాటిస్తారు. దీపావళి అమావాస్య రోజున జరుపుకుంటారు, ఇది దీపావళి సమయంలో లక్ష్మీ పూజ రోజుతో సమానంగా ఉంటుంది. ఈ కేధార వ్రతాన్ని ఆశ్వయుజ బహుళ అష్టమి నుండి ఆచరిస్తారు మరియు ఆశ్వయుజ అమావాస్య నాడు ముగిస్తారు. కానీ, ఆచరణలో కేదార గౌరీ వ్రతం ఒకే రోజు అంటే దీపావళి అమావాస్య రోజున నిర్వహిస్తారు.’*
---------------------------------------
*ఇది భార్యాభర్తలిద్దరూ కలిపి చేసుకునే వ్రతం. భర్తకు కుదరనప్పుడు భార్య మాత్రమే చేసుకోవచ్చు. భార్యకు వీలుకాక పోతే మాత్రం భర్త ఒక్కడే చేయ కూడదు. వివాహంకాని ఆడపిల్లలు కూడా ఈ నోము నోచుకోవచ్చు. ముందుగా 21 పేటల పట్టు దారాన్ని కాని, నూలు దారాన్ని కాని తోరంగా కట్టుకోవాలి. కలశంలోకి, ప్రతిమలోకి కేదారేశ్వరుని ఆవాహన చేయాలి. 21 ఉపచారాలతో పూజ చేయాలి. గోధుమపిండితో 21 నేతి అరిసెలు వండాలి.పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పాయసం, అన్ని రకాల కూరలు, పళ్లు నివేదన చేయాలి. కథ చెప్పుకున్నాక అక్షింతలు వేసుకోవటం మర్చిపోకూడదు.ఇలా 21 సంవత్సరాలు చేయాలి. కేదారం అంటే మాగాణం. వరి పండే పొలం. దానికి అధిపతి కేదారే శ్వరుడు. పార్వతీదేవి ప్రకృతి స్వరూపిణి. పార్వతి లేకపోతే శివుడు శక్తి హీనుడయిన గాథను వ్రత కథగా చెప్పుకుంటారు. ఈ వ్రతకథ స్త్రీ పురుషుల సమానత్వాన్ని తెలియచేస్తుంది. గౌరీదేవి లేనిదే శివుడికి పూజలేదు. గౌరితో కూడిన సాంబశివుణ్ణి పూజించే అరుదైన వ్రతం ఇది.*
----------------------------------------
*ముందుగా గణపతి పూజ:*
----------------------------------------
*ఆచమనం :-*
----------------------------------------
*ఓం కేశవాయ స్వాహా,* *నారాయణాయ స్వాహా,* *మాధవాయ స్వాహా* *(గ్లాసు లేదా చెంబులోని* *నీళ్ళను ఉద్ధరిణి లేదా చెంచాతో ముందుగా ఒకసారి నీళ్ళను అరచేతిలో వేసుకుని చేతులు శుభ్రం చేసుకోవాలి. తరువాత పైన చెప్పిన ఒక్కొక్క నామం చదువుతూ మూడు సార్లు తీర్థంగా స్వీకరించాలి. మళ్ళీ ఒకసారి నీళ్ళును అరచేతిలో వేసుకుని చేతులు శుభ్రం చేసుకోవాలి)*
*గోవిందాయనమః:* *విష్ణవే నమః,* *మధుసూధనాయ నమః,* *త్రివిక్రమాయ నమః,* *వామనాయ నమః,* *శ్రీధరాయ నమః,* *హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః,* *దామోదరాయ నమః,* *సంకర్షణాయ నమః,* *వాసుదేవాయ నమః,* *ప్రద్యుమ్నాయ నమః,* *అనిరుద్ధాయ నమః,* *పురుషోత్తమాయ నమః,* *అధోక్షజాయ నమః,* *నారసింహాయ నమః, అచ్యుతాయ నమః,* *ఉపేంద్రాయ నమః,* *హరయే నమః,* *శ్రీకృష్ణాయ నమః,* *శ్రీకృష్ణ పరబ్రాహ్మణే నమః,*
----------------------------------------
*శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం*
*ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే*
----------------------------------------
*ఓం అపవిత్రః పవిత్రోవా సర్వా వస్థాం గతోపివా*
*యస్మృరేత్పుండరీ కాక్షం సదాహ్యాభ్యంతరం శుచిః*
------------------------------------
*శ్రీ గోవింద గోవింద*
*ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే.*
*ఓంభూః ఓం భువః ఓగం సువః, ఓం మహః ఓంజనః* *ఓంతేపః ఓంగుం సత్యం ఓంతేత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ఓమాపోజ్యో తీరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం.*
*ప్రాణాయామము చేసి దేశకాలాలను స్మరించి సంకల్పం చేసుకోవాలి.*
*మమోపాత్త దురతక్షయద్వారా శ్రీపరమేశ్వర వుద్దస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రాహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన సంవత్సరము పేరు …. సంవత్సరే, … ఆయనే, … మాసే … పక్షే … తిథి … వాసరే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ,* *విశిష్టాయాం, శుభతిథౌ శ్రీమాన్ … గోత్రః … నామధేయః (ధర్మపత్ని సమేత) మమధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిధ్యర్థం,* *పుత్రపౌత్రాభివ్రుద్ధ్యార్థం, సర్వాభీష్ట సిద్ద్యర్థం కేదార వ్రత సమయే, సకల విఘ్న దోష నివారణార్ధం మహాగణపతి పూజాం కరిష్యే, తదంగ కలాశారాధానం కరిష్యే.*
---------------------------------------
*కలసస్య ముఖే విష్ణుః కంటే రుద్రసమాశ్రితః, మాలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాత్రు గణాస్మృతః* *కుక్షౌత్సాగరాసర్వేసప్త ద్వీపా వసుంధర, ఋగ్వేదోద యజుర్వేద సామవేదో అధర్వనః అంగైశ్చ సాహితాసర్వే కలశాంబు సమాశ్రితః*
----------------------------------------
*శ్లో || గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి*
*నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు*
*ఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాః*
*కలశోదకేన పూజా ద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య*
---------------------------------------- 
*(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా పూజా ద్రవ్యములపైన, తమపైన జల్లు కొనవలెను. తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుతూ ఈ క్రింది మంత్రము చదువవలెను.)*
-------------------------------------
*మం || ఓం గణానాంత్వ గణపతి హవామహే కవింకవీనాముపమశ్రస్తవం*

*జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్*

*శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి*
*(అక్షతలు వేయవలెను)*
----------------------------------------
*శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం* *సమర్పయామి*
*(నీళ్ళు చల్లవలెను)*

*శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః ఆర్ఘ్యం* *సమర్పయామి*
*(నీళ్ళు చల్లవలెను)*

*ముఖే శుద్దాచమనీయం సమర్పయామి* *శుద్దోదకస్నానం సమర్పయామి*
*(నీళ్ళు చల్లవలెను)*
--------------------------------------
*శ్రీ మహాగణాధిపతయే నమః* *వస్త్రయుగ్మం సమర్పయామి*
*(అక్షతలు చల్లవలెను)*
----------------------------------------
*శ్రీ మహాగణాధిపతయే నమః* *దివ్య శ్రీ చందనం సమర్పయామి*
*(గంధం చల్లవలెను)*
------------------------------------
*శ్రీ మహాగణాధిపతయే నమః* *అక్షతాన్ సమర్పయామి*
*(అక్షతలు చల్లవలెను)*

*ఓం సుముఖాయ నమః,ఏకదంతాయ నమః,కపిలాయ నమః,గజకర్ణికాయ నమః,లంబోదరాయ నమః,వికటాయ నమః,విఘ్నరాజాయ నమః,గణాధిపాయ నమః,ధూమకేతవే నమః,గణాధ్యక్షాయ నమః, ఫాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః,శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,మహాగణాదిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాం సమర్పయామి.*
----------------------------------------
*మహాగణాధిపత్యేనమః ధూపమాఘ్రాపయామి*
*(అగరవత్తుల ధుపం చూపించవలెను.)*
---------------------------------
*ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్*
----------------------------------------
*సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు* *అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః* *గుడోపహారం నివేదయామి.*
*(బెల్లం ముక్కను నివేదన చేయాలి)*
--------------------------------------
*ఓం ప్రాణాయస్వాహా,* *ఓం అపానాయస్వాహా,* *ఓం వ్యానాయ స్వాహా*                          
 *ఓం ఉదానాయ స్వాహా,* *ఓం సమానాయ స్వాహా ,* *మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.*
*(నీరు వదలాలి.)*
-----------------------------------
*తాంబూలం సమర్పయామి, నీరాజనం దర్శయామి.*
*(తాంబూలము నిచ్చి కర్పూరమును వెలిగించి చూపవలెను)*
--------------------------------------
*ఓం గణానాంత్వ గణపతిగ్ హవామహే కవింకవీనాముపమశ్రవస్తవం*

*జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్*

*శ్రీ మహాగణాదిపతయే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి*
--------------------------------------
*ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి*
----------------------------------------
*అనయా మయా కృత యధాశక్తి పూజాయచ శ్రీ మహాగణాధిపతిః సుప్రీతః* *సుప్రసన్నో వరదో భవతు*
*(అనుకొని* *నమస్కరించుకొని,దేవుని వద్ద గల అక్షతలు, పుష్పములు శిరస్సున ధరించవలసినది.)*
----------------------------------------
*తదుపరి పసుపు గణపతిని కొద్దిగా కదిలించవలెను.*
----------------------------------------
*శ్రీ మహాగణాధిపతయే నమః యధాస్థానం ముద్వాసయామి.*
-------------------------------------
*శ్రీ కేదారేశ్వర పూజ:*
---------------------------------------
*శూలం ఢమరుకంచైవ – దదానం హస్త యుగ్మకే కేదరదేవమీశానం ద్యాయేత్ త్రిపుర ఘూతినమ్ … శ్రీ కేదరేశ్వరాయనమః … ధ్యానం సమర్పయామి*
*కైలాస శిఖరే రమ్యే పార్వత్యా స్సహితప్రభో*
*ఆగచ్చ దేవదేవేశ మద్భక్తా చంద్రశేఖర* *శ్రీకేదారేశ్వరాయనమః …. ఆవాహయామి*
*సురాసుర శిరోరత్న – ప్రదీపిత పదాంబుజ*
*కేదారదేవ మద్దత్త మాసనం ప్రతిగుహ్యతామ్ శ్రీ కేదారేశ్వరాయనమః … ఆసనం సమర్పయామి*
*గంగాధర నమస్తేస్తు – త్రిలోచన వృషభద్వజ*
*మౌక్తికాసన సంస్థాయ – కేదార నమోనమః శ్రీ* *కేదారేశ్వరాయనమః … పాద్యం సమర్పయామి*
*అర్ఘ్యం గృహాణ భగవన్ – భక్త్యాదత్తం మహేశ్వర*
*ప్రయచ్చమే మనస్తుభ్యం – భక్తానా మిష్టదాయకం శ్రీ కేదారేశ్వరాయనమః … అర్ఘ్యం సమర్పయామి*
*మునిభిర్నా రాదప్రఖ్యైర్నిత్య మాఖ్యాత వైభవః*
*కేదారదేవ భగవాన్ గృహాణా చమనం విభో శ్రీ కేదారేశ్వరాయనమః …* *ఆచమనీయం సమర్పయామి*
*స్నానం పంచామృతైర్దేవ శుద్ధ శుద్ధోద కైరపి*
*గృహాణగౌరీరమణత్వద్భక్తేన మయార్పితం … శ్రీ కేదారేశ్వరాయనమః* *పంచామృతస్నానం సమర్పయామి*
*నదీజల సమాయుక్తం మయాదత్త మనుత్తమం*
*స్నానం స్వీకురుదేవేశ – సదాశివ నమోస్తుతే …* *శ్రీకేదారేశ్వరాయనమః స్నానం సమర్పయామి*
*వస్త్ర యుగ్మం సదాశుభ్రం – మనోహర మిదం శుభం*
*దదామి దేవదేవేశ భక్త్యేదం* *ప్రతిగృహ్యాతాం … శ్రీ కేదారేశ్వరాయనమః వస్త్రయుగ్మం సమర్పయామి*
*స్వర్ణ యజ్ఞోపవీతం కాంచనం చోట్టరీయకం*
*రుద్రాక్షమాలయా యుక్తం – దదామి స్వీకురు ప్రభో …* *శ్రీకేదారేశ్వరాయనమః యజ్ఞోపవీతం సమర్పయామి*
*సమస్త గ్రంధద్రవ్యాణాం – దేవత్వమసి జన్మభూః*
*భక్త్యాసమర్పితం ప్రీత్యా – మయాగంధాది గృహ్యతామ్ … శ్రీ కేదారేశ్వరాయనమః* *గంధాన్ ధారయామి*
*అక్షతో సి స్వభావేన –* *భక్తానామక్షయం పదం*
*దదాసినాథ మద్దతైరక్షతైః* *స్స్వీ యతాం భావాన్ శ్రీ కేదారేశ్వరాయనమః … అక్షతాన్ సమర్పయామి*
*కల్పవృక్ష ప్రసూవైస్వం పూర్వై రభ్యర్చిత సురైః కుంకుమైః పార్దివై రేభిరిదానీమర్చతాం* *మయా శ్రీ కేదారేశ్వరాయనమః పుష్పాణి పూజయామి*
*తతః ఇంద్రాది లోకపాలక పూజాం కుర్యాత్ శివస్య దక్షిణేభాగే (కుడివైపు)* *బ్రాహ్మణేనమః ఉత్తరభాగే (ఎడమవైపు) విష్ణవేనమః మధ్యే కేదారేశ్వరాయ నమః*
------------------------------------- 
*అథాంగ పూజ:*
------------------------------------
*మహేశ్వరాయ నమః – పాదౌపూజయామి*
*ఈశ్వరాయ నమః – జంఘే పూజయామి*
*కామరూపాయ నమః – జానునీ పూజయామి*
*హరాయ నమః – ఊరూ పూజయామి*
*త్రిపురాంతకాయ నమః – గుహ్యం పూజయామి*
*భవాయ నమః – కటిం పూజయామి*
*గంగాధరాయ నమః – నాభిం పూజయామి*
*మహాదేవాయ నమః – ఉదరం పూజయామి*
*ప్శుపతయే నమః – హృదయం పూజయామి*
*పినాకినే నమః – హస్తాన్ పూజయామి*
*శివాయ నమః – భుజౌ పూజయామి*
*శితికంఠాయ నమః – కంఠం పూజయామి*
*విరూపాక్షాయ నమః – ముఖం పూజయామి*
*త్రినేత్రాయ నమః – నేత్రాణి పూజయామి*
*రుద్రాయ నమః – లలాటం పూజయామి*
*శర్వాయ నమః – శిరః పూజయామి*
*చంద్రమౌళయే నమః – మౌళిం పూజయామి*
*పశుపతయే నమః – సర్వణ్యాంగాని పూజయామి*
-------------------------------------
*కేదారేశ్వర అష్టోత్తర శతనామ పూజ*
--------------------------------------
*ఓం శివాయ నమః*
*ఓం మహేశ్వరాయ నమః*
*ఓం శంభవే నమః*
*ఓం పినాకినే నమః*
*ఓం శశిశేఖరాయ నమః*
-------------------------------------
*ఓం వాసుదేవాయ నమః*
*ఓం విరూపాక్షాయ నమః*
*ఓం కపర్దినే నమః*
*ఓం నీలలోహితాయ నమః*
*ఓం శంకరాయ నమః*
*ఓం శూలపణాయే నమః*
*ఓం ఖట్వాంగినే నమః*
*ఓం విష్ణువల్లభాయ నమః*
*ఓం శిపివిష్టాయ నమః*
*ఓం అంబికానాథాయ నమః*
*ఓం శ్రీకంఠాయ నమః*
*ఓం భక్తవత్సలాయ నమః*
*ఓం భవాయ నమః*
*ఓం శర్వాయ నమః*
*ఓం త్రిలోకేశాయ నమః*
*ఓం శితికంఠాయ నమః*
*ఓం శివప్రియాయ నమః*
*ఓం ఉగ్రాయ నమః*
*ఓం కపాలినే నమః*
*ఓం కామారయే నమః*
*ఓం అంధకాసురసూదనాయ నమః*
*ఓం గంగాధరాయ నమః*
*ఓం లలాటాక్షాయ నమః*
*ఓం కాలకాలాయ నమః*
*ఓం కృపానిధయే నమః*
*ఓం భీమాయ నమః*
*ఓం పరశుహస్తాయ నమః*
*ఓం మృగపాణయే నమః*
*ఓం జటాధరాయ నమః*
*ఓం కైలాసవాసినే నమః*
*ఓం కవచినే నమః*
*ఓం కఠోరాయ నమః*
*ఓం త్రిపురాంతకాయ నమః*
*ఓం వృషంకాయ నమః*
*ఓం వృషభరూఢాయ నమః*
*ఓం భాస్మోద్ధూళితవిగ్రహాయ నమః*
*ఓం సామప్రియాయ నమః*
*ఓం సర్వమయాయ నమః*
*ఓం త్రయీమూర్తయే నమః*
*ఓం అనీశ్వరాయ నమః*
*ఓం సర్వజ్ఞాయ నమః*
*ఓం పరమాత్మనే నమః*
*ఓం సోమసూర్యగ్ని లోచనాయ నమః*
*ఓం హవిషే నమః*
*ఓం యజ్ఞమయాయ నమః*
*ఓం సోమాయ నమః*
*ఓం పంచవక్త్రాయ నమః*
*ఓం సదాశివాయ నమః*
*ఓం వీరభద్రాయ నమః*
*ఓం గణనాథాయ నమః*
*ఓం ప్రజాపతయే నమః*
*ఓం హిరణ్యరేతసే నమః*
*ఓం దుర్థర్షాయ నమః*
*ఓం గిరీశాయ నమః*
*ఓం గిరిశాయ నమః*
*ఓం అనఘాయ నమః*
*ఓం భుజంగభూషణాయ నమః*
*ఓం భర్గాయ నమః*
*ఓం గిరిధన్వినే నమః*
*ఓం గిరిప్రియాయ నమః*
*ఓం కృత్తివాసనే నమః*
*ఓం పురారాతయే నమః*
*ఓం భగవతే నమః*
*ఓం ప్రమధాధిపాయ నమః*
*ఓం మృత్యుంజయాయ నమః*
*ఓం సూక్ష్మతనవే నమః*
*ఓం జగద్వ్యాపినే నమః*
*ఓం జగద్గురవే నమః*
*ఓం వ్యోమకేశాయ నమః*
*ఓం మహాసేనజనకాయ నమః*
*ఓం చారువిక్రమాయ నమః*
*ఓం రుద్రాయ నమః*
*ఓం భూతపతయే నమః*
*ఓం స్థాణవే నమః*
*ఓం ఆహిర్బుద్న్యాయ నమః*
*ఓం దిగంబరాయ నమః*
*ఓం అష్టమూర్తయే నమః*
*ఓం అనేకాత్మనే నమః*
*ఓం సాత్త్వికాయ నమః*
*ఓం శుద్ధవిగ్రహాయ నమః*
*ఓం శాశ్వతాయ నమః*
*ఓం ఖండపరశవే నమః*
*ఓం అజాయ నమః*
*ఓం పాశవిమోచకాయ నమః*
*ఓం మృడాయ నమః*
*ఓం పశుపతయే నమః*
*ఓం దేవాయ నమః*
*ఓం మహాదేవాయ నమః*
*ఓం అవ్యయాయ నమః*
*ఓం హరయే నమః*
*ఓం పూషదంతభిదే నమః*
*ఓం అవ్యగ్రాయ నమః*
*ఓం దక్షాధ్వరహరాయ నమః*
*ఓం హరాయ నమః*
*ఓం భగనేత్రభిదే నమః*
*ఓం అవ్యక్తాయ నమః*
*ఓం సహస్రాక్షాయ నమః*
*ఓం సహస్రపాదే నమః*
*ఓం అపవర్గప్రదాయ నమః*
*ఓం అనంతాయ నమః*
*ఓం పరమేశ్వరాయ నమః*
*శ్రీ కేదారేశ్వర స్వామినే నమః* *నానావిధ పరిమళ పాత్ర పుష్పపూజాం సమర్పయామి*
----------------------------------------
*అధసూత్రపూజ:*
----------------------------------------
*ఓం శివాయ నమః – ప్రథమగ్రంధిం పూజయామి*
*ఓం శాంతాయ నమః – ద్వితీయగ్రంధిం పూజయామి*
*ఓం మహాదేవాయ నమః – తృతీయగ్రంధిం పూజయామి*
*ఓం వృషభద్వజాయ నమః – చతుర్థగ్రందిం పూజయామి*
*ఓం గౌరీశాయ నమః – పంచమగ్రందిం పూజయామి*
*ఓం రుద్రాయ నమః – షష్ఠగ్రందిం పూజయామి*
*ఓం పశుపతయే నమః – సప్తమగ్రందిం పూజయామి*
*ఓం భీమాయ నమః – అష్టమగ్రందిం పూజయామి*
*ఓం త్రయంబకాయ నమః – నవమగ్రందిం పూజయామి*
*ఓం నీలలోహితాయ నమః – దశమగ్రందిం పూజయామి*
*ఓం హరాయ నమః – ఏకాదశగ్రందిం పూజయామి*
*ఓం స్మరహరాయ నమః – ద్వాదశగ్రందిం పూజయామి*
*ఓం భర్గాయ నమః – త్రయోదశగ్రందిం పూజయామి*
*ఓం శంభవే నమః – చతుర్థగ్రందిం పూజయామి*
*ఓం శర్వాయ నమః – పంచదశగ్రందిం పూజయామి*
*ఓం సదాశివాయ నమః – షోఢశగ్రందిం పూజయామి*
*ఓం ఈశ్వరాయ నమః – సప్తదశగ్రందిం పూజయామి*
*ఓం ఉగ్రాయ నమః – అష్టాదశగ్రందిం పూజయామి*
*ఓం శ్రీకంఠాయ నమః – ఏకోన వింశతిగ్రందిం పూజయామి*
*ఓం నీలకంఠాయ నమః – వింశతిగ్రందిం పూజయామి*
*ఓం మృత్యుంజయాయనమః – ఏకవింశతి గ్రందిం పూజయామి*
----------------------------------------
*దశాంగం ధూపముఖ్యంచ –హ్యంగార వినివేశితం*
*ధూప సుగంధై రుత్పన్నం – త్వాంప్రిణయతుశంఖరశ్రీ కేదారేశ్వరాయనమః* *ధూపమాఘ్రాపయామి*
*యోగీనాం హృదయే ష్వేవ –జ్ఞానదీపాంకురోహ్యపి*
*బాహ్యదీపో మయాదత్తో – గృహ్యతాం భక్త గౌరవాత్* *శ్రీకేదారేశ్వరాయనమః దీపం సమర్పయామి*
*తైలోక్యమసి నైవేద్యం – తత్తే తృప్తిస్తథాబహిః*
*నైవేద్యం భక్తవాత్వల్యాద్గ్రుహ్యతాం* *త్ర్యంబకత్వయా శ్రీ కేదారేశ్వరాయనమః* *మహానైవేద్యం సమర్పయామి*
*నిత్యానంద స్వరూపస్త్యం – మోగిహృత్కమలేస్థితః*
*గౌరీశభక్త్యామద్దత్తం – తాంబూలం ప్రతిగృహ్యాతామ్ శ్రీకేదారేశ్వరాయనమః* *తాంబూలం సమర్పయామి*
*అర్ఘ్యం గృహాణ్ భగవాన్ – భక్త్యాదత్త మహేశ్వర*
*ప్రయచ్చ మే మనస్తుభ్యం – భక్తాన మిష్టదాయక* *శ్రీకేదారేశ్వరాయనమః అర్ఘ్యం సమర్పయామి*
*దేవేశ చంద్ర సంకాశం – జ్యోతి సూర్యమివోదితం*
*భక్త్యాదాస్యామి కర్పూర నీరాజన మిదం శివః* *శ్రీకేదారేశ్వరాయనమః* *కర్పూర నీరాజన దర్శయామి*
*ఓం తత్సురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహీ* *తన్నోరుద్రఃప్రచోదయాత్*
*నమో హిరణ్యబాహవే హిరణ్య వర్ణాయ హిరణ్య రూపాయ హిరణ్య పతయే శ్రీకేదారేశ్వరాయనమః వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి*
*భూటన భువనాదీశ – సర్వదేవాది పూజిత*
*ప్రదక్షిణం కరోమిత్యాం – వ్రతం మే సఫలం కురు* *శ్రీకేదారేశ్వరాయనమః ప్రదక్షిణం సమర్పయామి*
*హరశంభో మహాదేవ – విశ్వేశామరవల్లభ*
*శివశంకర సర్వాత్మా – నీలకంఠ నమోస్తుతే శ్రీకేదారేశ్వరాయనమః* *నమస్కారాన్ సమర్పయామి*
*ఛతరమాచ్చాదయామి,* *చామరేణ విజయమి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, ఆందోళికం నారోహయామి, సమస్తరాజోపచార, దేవోపచార, శక్త్యుపచార, భక్త్యుపచార సమర్పయామి.*
---------------------------------------
*అభీష్టసిద్ధిం కురుమే శివావ్యయ మహేశ్వర!* *భక్తానాం మిష్టదానార్థం మూర్తీకృతకళేభరః (పూజా తోరము తీసుకుంటున్న* *సమయంలో పఠించు మంత్రం)*
*కేదారదేవదేవేశ భాగవన్నంభికా పతే!* *ఏకవింశద్దినే తస్మిన్ సూత్రం గృహ్లామ్యహం ప్రభోః (తోరము కట్టుకోవడానికి పఠించు మంత్రం)*
*ఆయుశ్చ విద్యాం చ తథా సిఖంచ సౌభాగ్యవృద్ధిం కుర దేవ దేవ*
*సంసార ఘోరంబు నిధౌ నిమగ్నం మాంరక్ష కేదార నమో నమస్తే (వాయనం ఇచ్చే సమయంలో పఠించునది)*
*కేదారం ప్రతి గృహ్ణాతు కేదారో వైదరాతి చ కేదారస్తారకో భాభ్యాం కేదారాయ నమో నమః*
*వ్రతిమాదాన మంత్రం*
*కేదార ప్రతిమాం* *యస్మాద్రాజ్యం సౌభాగ్యవర్ధినీ తస్మాదస్యాః ప్రదనేన మమాస్తు శ్రీ రచంచలా!!*
*శ్రీ కేదారేశ్వర స్వామినే నమః సిప్రీతః* *సుప్రసన్నోవరదోభవతు మమ ఇష్టకామ్యర్థ సిద్ధిరస్తు.*
----------------------------------------
*పూజా విధానం సంపూర్ణం*
----------------------------------------
*శ్రీ కేదారేశ్వర వ్రత కథ*
----------------------------------------
*పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందు నిమిత్తము చేసిన వ్రతమగు కేదారేశ్వరుని వ్రతముని గూర్చి చెబుతాను. శ్రద్ధతో వినవలసిందని సూతుడు శౌనకాదులకు చెప్పెను. శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చునియుండెను. సిద్ధ-సాధ్య- కింపురుష-యక్ష-గంధర్వులు శివుని సేవించుచుండిరి. దేవముని గణములు శివుని స్తుతించుచుండిరి.*
----------------------------------------
*ఋషులు-మునులు-అగ్ని–వాయువు-వరుణుడు-సూర్యచంద్రులు-తారలు-గ్రహాలు-ప్రమదగణాలు-కుమారస్వామి-వినాయకుడు-వీరభద్రుడు-నందీశ్వరుడు సభయందు ఉపవిష్ణులై ఉన్నారు. నారద తుంబురాదులు శివలీలను గానం చేస్తున్నారు. రసాల-సాల-తమలా-వకుళ-నరికేళ-చందన-పనస-జంభూ వృక్షములతోను చంపక-పున్నాగ- పారిజాతాది పుష్పాదులతోను మణిమయ మకుట కాంతులతో చెలువొందు నదీ నదపరతముల తోను చతుర్ధశభువనాలు పులకిస్తున్నాయి.. అట్టి ఆనంద కోలాహలములలో భృంగురిటి అనబడు శివభక్త శ్రేష్టుడు ఆనందపులకితుడై నాట్య మాడసాగెను. అతడు వినోద సంభరితములగు నాట్యగతులతో సభాసదులను, శివుడ్ని మెప్పించు చుండెను.*
---------------------------------------
*శివుడాతనిని అభినందించి అంకతలమునగల పార్వతిని వీడి సింహాసనమునుండి లేచి భృంగురిటిని తన అమృత హస్తంతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదనునందు భృంగి మొదలగా గల వంది మాగాదులు శివునకు ప్రదక్షిణంచేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతీ భర్తను చేరి నాథా! నన్ను విడిచి మీకు మాత్రమే వీరెలా నమస్కరించిరి. ఆటపాటలతో మిమ్ము మెప్పించి మీ నుండి నన్ను వేరు పరచి ఇట్లేల చేసితిరని ప్రశ్నించెను. అంత సదాశివుడు సతీమణి పార్వతిని సందిటకు తీసుకొని దేవీ! పరమార్ధ విదులగు యోగులు నీవలన ప్రయోజనం కలుగచేయబడవని నిన్నిట్లు ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారని జవాబిచ్చాడు. సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలినైయుండి యాదండప్రణామములకు నోచుకొని అయోగ్యురాలనని కోపగించి ఈశ్వరునితో సమానమగు యోగ్యతను ఆర్జించుకొనుటకై తపస్సునొనర్చుటకై నిశ్చయించుకొన్నది.*
----------------------------------------
*కైలాసమునువదలి శరభ శార్దూల గజములుగల నాగ గరుడ చకవాక పక్షసముదాయంతో నానావిధ ఫలపుష్ప తరులతాదులతో కూడుకొనిన్న సస్యశ్యామలమైనట్టి గౌతమాశ్రమానికి వచ్చింది. ఆశ్రమవాసులామెను చూచి అతిధి మర్యాదలొనర్చి తల్లీ నీవెవ్వరవు ఎవరిదానవు ఎచటనుండి వచ్చితివి నీరాకకు గల అగత్యమేమిటని పార్వతిని ప్రశ్నించారు.*
---------------------------------------
*వారి ప్రశ్నలకు పార్వాతి మిక్కిలి ఆనందించినదై యఙ్ఞయాగాది క్రతువులచే పునీతమై గౌతమముని ఆశ్రమమున నియమనిష్టాగరిష్టులై అలరారు పుణ్యపురుషులారా పవిత్రాంగనలారా నేను హిమవంతుని పుత్రికను సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలిని. శివునిసతిగా నా నాధునితో సమానమగు యోగ్యతను పొందగోరి తపస్సొనర్చ సంకల్పించుకొన్నాను. ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చినదానను అన్నది పార్వతి.*
----------------------------------------
*మహర్షులారా! జగత్కళ్యాణాభిలాషులారా! నేను ఆశించిన ఫలమును పొంది శివుని అర్ధాంగినై తరించుటకు తగిన వ్రతమును నాకు ఉపదేశించుడని పార్వతి వారిని కోరుకున్నది. అందుకు గౌతముడు పార్వతీ ఈప్సితార్ధదాయకమగు ఉత్తమ వ్రతమొకటున్నది. అది కేదారేశ్వర వ్రతము. నీవావ్రతమును ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవలసిందన్నాడు గౌతముడు.*
----------------------------------------
*వ్రతవిధానమును వివరించమని పార్వతి గౌతముడ్ని కోరింది. జగజ్జననీ ఈ వ్రతాన్ని భాద్రపదమాసంలో శుక్ల అష్టమియందు ఆచరించాలి. ఆరోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరములగు ఏకవింశతి దారముతో చేతికి తోరముని ధరించి షోడశోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసముండవలెను. మర్నాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తరువాత ఆహారమును తీసుకోవలెను. ఇలా వ్రతమును ఆరంభించిన నాటినుండి అమావాస్య వరకు పూజాక్రమముతో కేదారేశ్వరుని ఆరాధించవలెను.*
---------------------------------------
*ఇంకా ధాన్యరాశినిపోసి అందు పూర్ణకుంభమునుంచి ఇరువదియొక్క పర్యాయములు సూత్రమును చుట్టి పట్టు వస్త్రముతో దానిని కప్పియుంచి నవరత్నములు గాని సువర్ణమును గాని ఉంచి గంధ పుష్పాక్షలతో పూజించాలి. దేవీ ఇరవై ఒక్కమంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములను కడిగి కూర్చుండబెట్టి యధావిధిగా ధూప దీప గంధ పుష్పాక్షతలతో పూజించి భక్ష్య- భోజ్య, నైవేద్యాదులు కదళీప్జలాలు పనసలు ఆరగింప చేసి తాంబూల దక్షిణలిచ్చివారలను తృప్తి పరచవలెను.*
----------------------------------------
*ఈ తీరున వ్రతమాచరించినవారిని శివుడు అనుగ్రహించి మనోభీష్టసిద్ధిని కలుగచేయునని గౌతముడు పార్వతికి వివరించాడు.*
--------------------------------------
*గౌతమ మహర్షి చెప్పిన విధి విధానములను అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్టగా భక్తితో చేసింది. పరమేశ్వరుడు సంతుష్టాంతరంగుడై ఆమె అభీష్టానుసారం తనమేనులో సగభాగము పార్వతికి అనుగ్రహించెను. అంత జగదాంబ సంతుష్టాంతరంగయై భర్తతో నిజనివాసము కైలాసమున కోరెను.*
----------------------------------------

Saturday, 6 September 2025

చంద్రగ్రహణం మరియు నివారణ పూజలు

*🌑☀️గ్రహణ పురశ్చర్య -- ప్రాముఖ్యత........!!*
 *గ్రహణం (సూర్య లేదా చంద్ర గ్రహణం) సమయంలో, విశ్వశక్తులు చాలా అస్థిరంగా ఉంటాయి. ఈ సమయంలో రాజస మరియు తామస శక్తులు విజృంభిస్తాయి. అందుకే దేవాలయాలను మూసివేస్తారు. అయితే, ఇదే సమయం మంత్ర సాధన చేసేవారికి అత్యంత శ్రేయస్కరం. ఈ సమయంలో చేసిన జపం, తక్కువ సమయంలోనే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందని నమ్ముతారు.
*గ్రహణ సమయంలో జపించిన మంత్రం శీఘ్రసిద్ధిని మరియు ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.*

*సంఖ్యతో పనిలేదు:-
గ్రహణ కాలంలో జపించిన సంఖ్యతో సంబంధం లేకుండా, అది లక్ష జపంతో సమానమని నమ్ముతారు. ఇది సాధకులకు గొప్ప వరం.*
*గ్రహణ పురశ్చర్య విధానం.....*
*ఇక్కడ చెప్పిన విధానం శాస్త్ర ప్రకారం ఉంది మరియు చాలా ముఖ్యమైనది.*

*స్థానం:-* -------------------------------------- *నది, సముద్ర తీరం వద్ద లేదా ఇంట్లో జపం చేయవచ్చు.*
-------------------------------------
*శుద్ధి:-* --------------------------------------- *జపం ప్రారంభించడానికి ముందు ఆచమనం మరియు ప్రాణాయామం చేయాలి.*
--------------------------------------
*సంకల్పం:-* --------------------------------------- *జపం ప్రారంభించే ముందు సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం అనేది ఒక నిర్దిష్టమైన ప్రయోజనం కోసం చేసే కర్మను ప్రారంభించడానికి తీసుకునే నిర్ణయం.*
--------------------------------------
*గ్రహణం రాకముందు సిద్ధత....*
--------------------------------------- *1)ముందుగా శరీరం శుద్ధి కోసం స్నానం చెయ్యాలి.*
*2)పూజా స్థలం లేదా నది/సముద్ర తీరంలో కూర్చునే స్థలం సిద్ధం చేసుకోవాలి.*
*3)దర్భాసనం లేదా శుభ్రమైన వస్త్రాసనం వేసుకోవాలి.*
*4)జపానికి కావలసిన మాల, దివ్యచిత్రం/దేవతా విగ్రహం, నీటి పాత్ర సిద్ధం చేసుకోవాలి*
----------------------------------------
*(గ్రహణం ప్రారంభం (పట్టు క్షణం).......*
*1)ఆచమనం – మూడు సార్లు నీళ్లు త్రాగాలి*
*2)ప్రాణాయామం – మనసు కేంద్రీకరించుకోవాలి*
*3)సంకల్పం చదవాలి (మీ గోత్రం, పేరు, దేవత పేరు ఉంచాలి):......*
----------------------------------------
*మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా* *శ్రీ _____ పరదేవతా ముద్దిస్య*  
*శ్రీ _____ పరదేవతా ప్రీత్యర్థం*  
*_____ గోత్రోద్భవస్య, _____ నామధేయస్య*
*అహం, పవిత్ర _____ గ్రహణకాలే*
*స్పర్శాది మోక్షపర్యంతం* 
*శ్రీ _____ మంత్ర జపం కరిష్యే*
---------------------------------------
*జపం:-* --------------------------------------- *(గ్రహణ సమయం మొత్తం).........*
*ఒకే మంత్రాన్ని నిరంతరం జపించాలి.*
*సంఖ్య అవసరం లేదు.* *సమయమంతా జపం చేస్తే అది లక్ష జపంతో సమానం.*
*మంత్రం భక్తితో, శ్రద్ధతో, ఎలాంటి అంతరాయం లేకుండా జరగాలి.*
--------------------------------------
*గ్రహణం విడుపు (ముగిసిన తరువాత)........*
*1)జపం ముగిసిన వెంటనే మళ్లీ స్నానం చేయాలి*
*2)స్నానం తరువాత మళ్లీ ఆచమనం (మూడు సార్లు నీరు త్రాగాలి)*
*3)జప సమర్పణ మంత్రం చదవాలి:....*
--------------------------------------
*అనేన మయాకృతేన శ్రీ* *_____ పరదేవతా మంత్రజపేన*
*శ్రీ _____ పరదేవతా సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు.* 
*శ్రీ _____ పరదేవతా సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్ధం*
*ఏతత్ జపఫలం శ్రీ _____ పరదేవతా* *చరణారవిందార్పణమస్తు.------------------------------*  
*తత్సత్ బ్రహ్మార్పణమస్తు.*
---------------------------------------
*4)చేతిలో నీళ్లు తీసుకుని పళ్ళెంలో విడదల చేసి,. ఆ నీటిని మూడు సార్లు తీర్థంగా త్రాగాలి.*
----------------------------------------
*గ్రహణం తరువాతి దినచర్య..........*
*గ్రహణం జరిగిన తరువాత రోజు లేదా శుభదినం:*
*10,000 హోమం*
*1,000 తర్పణం*
*100 మార్జనం / అభిషేకం*
*10 మంది బ్రాహ్మణ భోజనం చేయడం వల్ల పురశ్చరణ సంపూర్ణమవుతుంది.*
-------------------------------------
*ముఖ్యాంశం........*
--------------------------------------- *గ్రహణ సమయంలో చేసే జపం = 1 లక్ష జపం.*
*హోమాది ఇతర కర్మలు తరువాత తప్పక చేయాలి.*
*ఈ సమయం మహాసిద్ధి కలిగించే అద్భుతమైన యోగక్షేమ సమయం.*
--------------------------------------- *జాగ్రత్తలు........*
--------------------------------------- *ఈ సాధన ఒక సాధారణ భక్తుడికి కాకుండా, తాంత్రిక మరియు మంత్ర సాధకులు తమ సాధనను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడానికి ఉపయోగపడుతుంది. ఈ విధానం చాలా శక్తివంతమైనది కాబట్టి, దీన్ని సరైన గురువు పర్యవేక్షణలో చేయడం శ్రేయస్కరం. ఈ సమాచారం ఆధ్యాత్మిక సాధకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.* --------------------------------------- *2025 సెప్టెంబర్ 7 చంద్రగ్రహణం గురించి పూర్తి వివరణను ఇక్కడ సమగ్రంగా............!!*
----------------------------------------
*చంద్ర గ్రహణ విశేషాలు.......*
---------------------------------------- *తేదీ: 2025 సెప్టెంబర్ 7, ఆదివారం*
*తిథి: భాద్రపద పౌర్ణమి*
*నక్షత్రం: శతభిషము,* *పూర్వాభాద్ర*
*రాశి: కుంభరాశి*
*గ్రహణం రకం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం*
*భారతదేశం మొత్తం గ్రహణం స్పష్టంగా కనబడుతుంది*
---------------------------------------
*గ్రహణ కాలమానం........*
----------------------------------------
*స్పర్శ (ప్రారంభం): రాత్రి 9:57*
----------------------------------------
*సంపూర్ణ గ్రహణ ప్రారంభం: రాత్రి 11:00*
--------------------------------------
*మధ్యకాలం: రాత్రి 11:41*
---------------------------------------
*విడుపు ప్రారంభం: రాత్రి 12:22 (8వ తేదీ)*
--------------------------------------
*ముగింపు: ఉదయం 1:26 (8వ తేదీ)*
----------------------------------------
*పుణ్యకాలం: 3 గంటలు 29 నిమిషాలు*
*సంపూర్ణ బింబ దర్శనం: 1 గంట 22 నిమిషాలు*
----------------------------------------
*రాశులపై ప్రభావం.......*
*ప్రతికూల ప్రభావం కలిగే రాశులు:......*
*వృషభ, మిథున, సింహ, కన్య, తుల, మకర, కుంభ, మీన వీరు మహాశివారాధన చేయడం, ఉపవాసం, జపం చేయడం మంచిది.*
*ప్రత్యేకంగా ఈ మంత్రం జపం చేయడం శ్రేయస్కరం:*
*"ఓం నమః శివాయ" (అనేక జన్మల పాప పరిహారానికి శక్తివంతమైనది).*
----------------------------------------
*దోషం లేకుండా బాగున్న రాశులు:.....*
*మేష, కర్కాటక, వృశ్చిక, ధనుస్సు*
*వీరికి ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు.*
--------------------------------------
*ఆలయ విధానం......*
----------------------------------------
*గ్రహణానికి ముందు: సెప్టెంబర్ 7న మధ్యాహ్నం 12 గంటల లోపు దేవాలయాల్లో నివేదనలు సమర్పించి, ఆలయ ద్వారాలు మూయాలి.*
----------------------------------------
*గ్రహణం తరువాత: సెప్టెంబర్ 8 ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య సంస్కారం చేసి, విగ్రహాలకు అభిషేకం చేయాలి.*
------------------------------------
*ఆచారాలు (గ్రహణ దినం).....*
--------------------------------------
*తద్దినాలు పెట్టుకోవాలనుకునే వారు మధ్యాహ్నం 1:20 లోపు పెట్టుకోవాలి.*
----------------------------------------
*గ్రహణ కాలంలో ఉపవాసం, మంత్రజపం, దానధర్మాలు చేయాలి.*
----------------------------------------
*గర్భిణీ స్త్రీలు, పిల్లలు జాగ్రత్తలు పాటించాలి (కత్తెర, సూది పనులు చేయరాదు, బయటకు వెళ్లరాదు)*
--------------------------------------
*మొత్తానికి, 2025 సెప్టెంబర్ 7 చంద్రగ్రహణం భారతదేశంలో పూర్తిగా దర్శనమయ్యే అరుదైన గ్రహణం, ఇది కొందరికి ఆధ్యాత్మిక పరంగా శ్రేయస్కరమైతే, కొందరికి శాంతి జపాలు అవసరం.* ---------------------------------------- *చంద్రగ్రహణం వివరణ*
--------------------------------------
*ఈ ఏడాది శ్రీ విశ్వావసు నామ సంవత్సరము* -------------------------------------- *దక్షిణాయనము-భాద్రపద- శుక్ల-పూర్ణిమ-ఆదివారము తేది 07-09-2025 రోజున పూర్వప్రోష్ఠపదా-నక్షత్రయుక్త రాహుగ్రస్తం, సోమోపరాగం, పింగళవర్ణం, అపసవ్యగ్రహణం తూర్పు ఈశాన్యములో స్పర్శ, తూర్పు ఆగ్నేయములో నిమీలనము, దక్షిణనైఋతిలో ఉన్మీలనము, పశ్చిమనైరుతిన మోక్షము ముగింపు కలుగును. ఈసారి చంద్రగ్రహణం ప్రత్యేకమైనది. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశమంతటా కన్పిస్తుంది. ఈ సమయంలో, చంద్రుడిని బ్లడ్ మూన్ అని పిలుస్తారు, ఎందుకంటే ఈ రోజున చంద్రుడి రంగు ఎరుపు రంగులోకి మారుతాడు.* 
---------------------------------------
*ఎక్కడెక్కడ చంద్ర గ్రహణం కనపడుతుంది?*
--------------------------------------- *ఈ చంద్రగ్రహణం భారతదేశమంతా కనిపించును. మన దేశంతో పాటు ఆసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఈ చంద్ర గ్రహణాన్ని చూడవచ్చు. అదేవిధముగా మయన్మార్, చైనా, దక్షిణాఫ్రికా, బ్యాంకాక్, జర్మని, రష్యా, దక్షిణకొరియా, ఇటలి, సింగపూర్, జపాన్, లండన్ ప్రాంతాలలో కనిపించును. సాయంత్రం చంద్ర గ్రహణం ఏర్పడటం వల్ల ఈ రోజున పితృదేవతల పనులకు ఎలాంటి ఆటంకం ఉండదు. సూతక కాలం మధ్యాహ్నం నుండి ప్రారంభమవుతుంది, కాబట్టి పితృ పక్షం పనిని ముందుగానే పూర్తి చేయాలి.* 
--------------------------------------
*గ్రహణసమయం*
-------------------------------------- *ఆగ్నేయ స్పర్శ రాత్రి 9-57,నిమీలకాలము రాత్రి11-00, మధ్యకాలము* *రాత్రి 11-41* *ఉన్మిలనకాలము రాత్రి 12-22, నైఋతి మోక్షకాలము రాత్రి 1-26, ఆద్యంత పుణ్యకాల రాత్రి 03-29-24*
*ఆరంభస్నానము, సంకల్పము, తర్పణము, జపాదులు 9-57 నిలకు ప్రారంభించాలి. 12.22 దానము చేయాలి. తిరిగి 1.26 నిలకు మోక్షస్నానము ఆచరించాలి. గ్రహణవేధ ఉదయం 12.57 నుండి ఉంటుంది. ఉదయం 12.57 లోపల నిత్యవిధులు, శ్రాద్ధవిధులు ముగించాలి.*
-------------------------------------
*సూతక కాలం*
-------------------------------------- *ఆదిత్యే గ్రహణే ప్రాప్తే త్రియామం సూతకం భవేత్, చంద్రస్య గ్రహణే పూర్వం యామంద్విత్రించ సూతకం|* *ఆబ్దికం సూతకే నైవ కర్తవ్యం విధివత్ భవేత్* *( ధర్మసింధు)*
*ధర్మసింధు ప్రకారం,* *సూర్యగ్రహణ సమయంలో తొమ్మిది గంటల ముందు, చంద్రగ్రహణ సమయంలో ఆరు గంటల ముందు సూతకం గ్రహణవేధ ప్రారంభమగును. ఈ నియమం ప్రకారం సెప్టెంబర్ 7వ తేదీన వచ్చే రాహుగ్రస్త చంద్రగ్రహణానికి సూతక కాలం మధ్యాహ్నం 12.57 గంటల నుండి ప్రారంభమవుతుంది. ఈ సూతక కాలంలో దేవాలయాల్లో పూజలు చేయరు. ఆలయాల తలుపులు మూసివేస్తారు. ఎలాంటి శుభకార్యాలు, పూజలు చేయకూడదు. ఈ సమయంలో మంత్రాలు, స్తోత్రములు మొదలైనవి పఠించాలి. గ్రహణం ముగిసిన తర్వాత పూజా గదిని శుభ్రం చేసుకుని పూజలు చేయవచ్చు. పగలు 12.57 వరకు భోజన ప్రత్యాబ్ధిములు ముగించుకొనవలెను. బాలవృద్ధులు సాయంత్రం 5-00 గం||ల వరకు భోజనాదులు ముగించుకొనవలెను. గర్భిణి స్త్రీలు రాత్రి 9-30 గం||ల నుండి 1-30 గం॥ల వరకు గ్రహణవేధ పాటించవలెను. మరసటి రోజు(తేది 08-09-2025) సంప్రోక్షణ చేయవలెను.*
---------------------------------------
*ఏం దానం చేయాలి?*
 *చంద్రగ్రహణం, పితృ పక్షం కారణంగా, ఈ రోజు దానం అనేక రెట్లు ఫలాలను పొందుతుంది. అందువల్ల, ఈ రోజున తెల్లని వస్తువులు వస్త్రము, బియ్యము, పాలు, పెరుగు, వెండి, ముత్యం, బంగారు ప్రతిమ దానం చేయడం చాలా ప్రయోజనకరం మరియు సుఖము.*
--------------------------------------
*ఎవరు గ్రహణ శాంతి చేసుకోవాలి*
ఈ గ్రహణం శతభిష నక్షత్రము, పూర్వాభాద్ర నక్షత్రములందు సంభవించుటవలన శతభిషం, పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు కుంభరాశి, మేష, వృషభ, మిధున రాశి వారు గ్రహణం చూడరాదు.*
---------------------------------------- 
*యస్య త్రిజన్మ నక్షత్రే గ్రస్యతే శశి భాస్కరౌ , తజ్జాతానాం భవేత్పీడా యే జనాః శాంతి వర్జితాః*
*జన్మ సప్త అష్టరిఫాంక దశమస్థే నిశాకరే, దృష్టోరిష్టః ప్రదోరాహుః జన్మాఋక్షే నిధనేపి చ*
----------------------------------------
*పూర్వాభాద్ర, పుసర్వసు, విశాఖా నక్షత్రములవారు, కుంభరాశివారు, సింహ, కర్కాటక, మీన, మకర మరియు వృషభ రాశులవారు మరునాడు గ్రహణశాంతి చేసుకోవలయును. (ఈ గ్రహణం ప్రభావం మంచి అయినా, చెడు అయినా 6నెలలు ఉంటుంది)*
----------------------------------------
*అలాగే గ్రహణ గోచారం ప్రకారం కుంభ, వృశ్చిక, కర్కాటక, మీన రాశి వారికి కూడా గ్రహణ ప్రభావం ఉంటుంది. కావునా గ్రహణం అయిన మరుసటి రోజు అనగా సెప్టెంబర్ 8వ తేదీన ఉదయం శుచి అయిన తరువాత దగ్గర లో ఉన్న దేవాలయానికి వెళ్లి పాలు, పెరుగు, ఒక కిలోంపావు నల్ల మినుములు(ఉద్దిపప్పు) ఒక తెలుపురంగు పంచ, టవల్ లేదా జాకెట్ గుడ్డ (కొత్తది ), అలాగే ఒక కిలోంపావు బియ్యం, వెండి సర్పం, ముత్యము, స్వర్ణప్రతిమ అదేవిధముగా శక్తి కొలది దక్షిణ తాంబూలం పెట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వవలెను. ( వెండి సర్పం ప్రతిమను కూడా దానం ఇచ్చినచో విశేషం ఫలితం ఉంటుంది. కానీ ఆర్ధిక శక్తిని దృష్టిలో ఉంచుకొని చేయండి)*

*గ్రహణ శాంతి చేసుకోనివారు*
 *ఇంద్రనలో దండధరశ్ఛ ఋక్షః ప్రచేతసో వాయుకుబేర ఈశాః 
*మజ్జన్మ ఋక్షే మమరాశి సంస్థే సోమోపరాగం శమయంతు సర్వే*

*అను శ్లోకాన్ని 11 సార్లు చదువుకొని అశ్వత్థ అంటే రావిచెట్టుకి ప్రదక్షిణలు చేసి నమస్కరించాలి.* 

*గ్రహణ ఫలితము*
కళింగ వంగ సోవీర సౌరాష్ట్రాన్ మ్లేచ్ఛదేశజాన్ । హంతి రాహుర్నభస్యేతు యోషిద్గర్భ వినాశకృత్ ॥*
*భాద్రపద మాసములో గ్రహణము సంభవించినచో కళింగ, వంగ, సౌవీర, సౌరాష్ట్ర దేశములలో అరిష్టము కలుగును మరియు తురుష్కులకు మరియు గర్భిణులకు ఇబ్బందులు కలుగును. ఈ గ్రహణము వలన అధికారులకు, వర్తక వాణిజ్యకారులకు, నష్టము వాటిల్లును. నదీతీర ప్రాంతములయందు ఇబ్బందులు ఏర్పడుట, భయోత్పాతకములు జరుగును. అగ్నితత్వ నక్షత్రములగుటచే తినే పదార్ధముల ధరలు అధికమగును. కళాకారులకు మంచి కీర్తిప్రతిష్టలు పెరుగును.

Tuesday, 10 June 2025

అరుణాచల అష్టకం

అరుణాచల అష్టకం:

దర్శనాదభ్రసదసి జననాత్కమలాలయే ।
కాశ్యాం తు మరణాన్ముక్తిః స్మరణాదరుణాచలే ॥ 1 ॥

కరుణాపూరితాపాంగం శరణాగతవత్సలమ్ ।
తరుణేందుజటామౌలిం స్మరణాదరుణాచలమ్ ॥ 2 ॥

సమస్తజగదాధారం సచ్చిదానందవిగ్రహమ్ ।
సహస్రరథసోపేతం స్మరణాదరుణాచలమ్ ॥ 3 ॥

కాంచనప్రతిమాభాసం వాంఛితార్థఫలప్రదమ్ ।
మాం చ రక్ష సురాధ్యక్షం స్మరణాదరుణాచలమ్ ॥ 4 ॥

బద్ధచంద్రజటాజూటమర్ధనారీకలేబరమ్ ।
వర్ధమానదయాంభోధిం స్మరణాదరుణాచలమ్ ॥ 5 ॥

కాంచనప్రతిమాభాసం సూర్యకోటిసమప్రభమ్ ।
బద్ధవ్యాఘ్రపురీధ్యానం స్మరణాదరుణాచలమ్ ॥ 6 ॥

శిక్షయాఖిలదేవారి భక్షితక్ష్వేలకంధరమ్ ।
రక్షయాఖిలభక్తానాం స్మరణాదరుణాచలమ్ ॥ 7 ॥

అష్టభూతిసమాయుక్తమిష్టకామఫలప్రదమ్ ।
శిష్టభక్తిసమాయుక్తాన్ స్మరణాదరుణాచలమ్ ॥ 8 ॥

వినాయకసురాధ్యక్షం విష్ణుబ్రహ్మేంద్రసేవితమ్ ।
విమలారుణపాదాబ్జం స్మరణాదరుణాచలమ్ ॥ 9 ॥

మందారమల్లికాజాతికుందచంపకపంకజైః ।
ఇంద్రాదిపూజితాం దేవీం స్మరణాదరుణాచలమ్ ॥ 10 ॥

సంపత్కరం పార్వతీశం సూర్యచంద్రాగ్నిలోచనమ్ ।
మందస్మితముఖాంభోజం స్మరణాదరుణాచలమ్ ॥ 11 ॥

ఇతి శ్రీఅరుణాచలాష్టకమ్ 
🙏

Tuesday, 4 March 2025

మరుగున పడుతున్న కొన్ని 209 తెలుగు సామెతలు..మీకోసం

⚡ మరుగున పడుతున్న కొన్ని 209 తెలుగు సామెతలు..మీకోసం

1. అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు
2. అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా
3. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ
4. అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు
5. అనువు గాని చోట అధికులమనరాదు
6. అభ్యాసం కూసు విద్య
7. అమ్మబోతే అడివి కొనబోతే కొరివి
8. అయితే ఆదివారం కాకుంటే సోమవారం
9. ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం
10. ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత
11. ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు
12. ఇంట గెలిచి రచ్చ గెలువు
13. ఇల్లు పీకి పందిరేసినట్టు
14. ఎనుబోతు మీద వాన కురిసినట్టు
15. చెవిటి వాని ముందు శంఖమూదినట్టు
16. కందకు లేని దురద కత్తిపీటకెందుకు
17. కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు
18. కుక్క కాటుకు చెప్పుదెబ్బ
19. కోటి విద్యలూ కూటి కొరకే
20. నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు
21. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం
22. పిట్ట కొంచెం కూత ఘనం
23. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు
24. వాన రాకడ ప్రాణపోకడ ఎవరి కెరుక
25. కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు
26. మింగమెతుకులేదు మీసాలకు సంపంగి నూనె
27. ఆడబోయిన తీర్థము యెదురైనట్లు
28. ఆడలేక మద్దెల వోడు అన్నట్లు
29. ఆది లొనే హంస పాదు
30. ఏమీ లేని యెడారిలో ఆముదము చెట్టే మహా వృక్షము
31. ఆకలి రుచి యెరుగదు నిద్ర సుఖమెరుగదు
32. ఆకాశానికి హద్దే లేదు
33. ఆలస్యం అమృతం విషం
34. ఆరే దీపానికి వెలుగు యెక్కువ
35. ఆరోగ్యమే మహాభాగ్యము
36. ఆవులింతకు అన్న ఉన్నాడు కాని తుమ్ముకు తమ్ముడు లేడంట
37. ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా?
38. అబద్ధము ఆడినా అతికినట్లు ఉండాలి
39. అడగందే అమ్మైనా అన్నము పెట్టదు
40. అడ్డాల నాడు బిడ్డలు కాని గడ్డాల నాడు కాదు
41. ఏ ఎండకు ఆ గొడుగు
42. అగ్నికి వాయువు తోడైనట్లు
43. ఐశ్వర్యమొస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమంటాడు
44. అందని మామిడిపండ్లకు అర్రులు చాచుట
45. అందితే జుట్టు అందక పోతే కాళ్ళు
46. అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు
47. అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేదు
48. అప్పు చేసి పప్పు కూడు
49. అయ్య వారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా
50. అయ్యవారిని చెయ్యబొతే కోతి బొమ్మ అయినట్లు
51. బతికుంటే బలుసాకు తినవచ్చు
52. భక్తి లేని పూజ పత్రి చేటు
53. బూడిదలో పోసిన పన్నీరు
54. చాదస్తపు మొగుడు చెబితే వినడు,
గిల్లితే యేడుస్తాడు
55. చాప కింద నీరులా
56. చచ్చినవాని కండ్లు చారెడు
57. చదివేస్తే ఉన్నమతి పోయినట్లు
58. విద్య లేని వాడు వింత పశువు
59. చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ
60. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు
61. చక్కనమ్మ చిక్కినా అందమే
62. చెడపకురా చెడేవు
63. చీకటి కొన్నాళ్ళువెలుగు కొన్నాళ్ళు
64. చెరువుకి నీటి ఆశ నీటికి చెరువు ఆశ
65. చింత చచ్చినా పులుపు చావ లేదు
66. చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే,
ఆ వంకర టింకరవి యేమి కాయలని అడిగిందట
67. చిలికి చిలికి గాలివాన అయినట్లు
68. డబ్బుకు లోకం దాసోహం
69. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు
70. దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన
71. దాసుని తప్పు దండంతో సరి
72. దెయ్యాలు వేదాలు పలికినట్లు
73. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు
74. దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొర బుద్ధి
75. దొంగకు తేలు కుట్టినట్లు
76. దూరపు కొండలు నునుపు
77. దున్నపోతు మీద వర్షం కురిసినట్లు
78. దురాశ దుఃఖమునకు చెటు
79. ఈతకు మించిన లోతే లేదు
80. ఎవరికి వారే యమునా తీరే
81. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు
82. గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందంట
83. గాజుల బేరం భోజనానికి సరి
84. గంతకు తగ్గ బొంత
85. గతి లేనమ్మకు గంజే పానకం
86 గోరు చుట్టు మీద రోకలి పోటు
87. గొంతెమ్మ కోరికలు
88. గుడ్డి కన్నా మెల్ల మేలు
89. గుడ్డి యెద్దు చేలో పడినట్లు
90. గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు
91. గుడినే మింగే వాడికి లింగమొక లెఖ్ఖా
92. గుడిని గుడిలో లింగాన్నీ మింగినట్లు
93. గుడ్ల మీద కోడిపెట్ట వలే
94. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట
95. గుర్రము గుడ్డిదైనా దానాలో తక్కువ లేదు
96. గురువుకు పంగనామాలు పెట్టినట్లు
97. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు
98. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు
99. ఇంటి పేరు కస్తూరివారు వీధిలో గబ్బిలాల కంపు
100. ఇంటికన్న గుడి పదిలం
101. ఇసుక తక్కెడ పేడ తక్కెడ
102. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట
103. కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు
104. కాగల కార్యము గంధర్వులే తీర్చినట్లు
105. కాకి ముక్కుకు దొండ పండు
106. కాకి పిల్ల కాకికి ముద్దు
107. కాలం కలిసి రాక పోతే కర్రే పామై కాటు వేస్తుంది
108. కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితే తీసుకోగలమా
109. కాసుంటే మార్గముంటుంది
110. కడుపు చించుకుంటే కాళ్ళపైన పడ్డట్లు
111. కలకాలపు దొంగ ఏదో ఒకనాడు దొరుకును
112. కలి మి లేములు కావడి కుండలు
113. కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుడతాడు
114. కంచే చేను మేసినట్లు
115. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా !
116. కందకు కత్తి పీట లోకువ
117. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం
118. కీడెంచి మేలెంచమన్నారు
119. కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడినట్లు
120. కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచువలే కరిగినట్లు
121. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు
122. కొన్న దగ్గిర కొసరే గాని కోరిన దగ్గర కొసరా
123. కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందిట
124. కూటికి పేదైతే కులానికి పేదా
125. కొరివితో తల గోక్కున్నట్లే
126. కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు
127. కొత్తొక వింత పాతొక రోత
128. కోటిి విద్యలు కూటి కొరకే
129. కొత్త అప్పుకు పొతే పాత అప్పు బయటపడ్డదట
130. కొత్త బిచ్చగాడు పొద్దు యెరగడు
131. కృషితో నాస్తి దుర్భిక్షం
132. క్షేత్ర మెరిగి విత్తనము పాత్ర మెరిగి దానము
133. కుడుము చేతికిస్తే పండగ అనేవాడు
134. కుక్క వస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు
135. ఉన్న లోభి కంటే లేని దాత నయం
136. లోగుట్టు పెరుమాళ్ళకెరుక
137. మెరిసేదంతా బంగారం కాదు
138. మంచమున్నంత వరకు కాళ్ళు చాచుకో
139. నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది
140. మంది యెక్కువయితే మజ్జిగ పలచన అయినట్లు
141. మనిషి మర్మము.. మాను చేవ...
బయటకు తెలియవు
142. మనిషి పేద అయితే మాటకు పేదా
143. మనిషికి మాటే అలంకారం
144. మనిషికొక మాట పశువుకొక దెబ్బ
145. మనిషికొక తెగులు మహిలో వేమా అన్నారు
146. మంత్రాలకు చింతకాయలు రాల్తాయా
147. మీ బోడి సంపాదనకుఇద్దరు పెళ్ళాలా
148. మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయ్యిందట
149. మొక్కై వంగనిది మానై వంగునా
150. మొరిగే కుక్క కరవదు కరిసే కుక్క మొరగదు
151. మొసేవానికి తెలుసు కావడి బరువు
152. ముల్లును ముల్లుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతొనే కొయ్యాలి
153. ముందర కాళ్ళకి బంధాలు వేసినట్లు
154. ముందుకు పోతే గొయ్యి వెనుకకు పోతే నుయ్యి
155. ముంజేతి కంకణముకు అద్దము యెందుకు
156. నడమంత్రపు సిరి నరాల మీద పుండు
157. నేతి బీరకాయలో నెయ్యి యెంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది
158. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా
159. నవ్వు నాలుగు విధాలా చేటు
160. నీ చెవులకు రాగి పొగులే అంటే అవీ నీకు లేవే అన్నట్లు
161. నిదానమే ప్రధానము
162. నిజం నిప్పు లాంటిది
163. నిమ్మకు నీరెత్తినట్లు
164. నిండు కుండ తొణకదు
165. నిప్పు ముట్టనిదే చేయి కాలదు
166. నూరు గొడ్లు తిన్న రాబందుకైనా ఒకటే గాలిపెట్టు
166. నూరు గుర్రాలకు అధికారయినా, భార్యకు యెండు పూరి
167. ఆరు నెళ్ళు సావాసం చేస్తే వారు వీరు అవుతారు
168. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు
169. ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు
170. బతికి ఉంటే బలుసాకు తినవచ్చు
171. ఊరంతా చుట్టాలు ఉత్తికట్ట తావు లేదు
172. ఊరు మొహం గోడలు చెపుతాయి
173. పనమ్మాయితొ సరసమ్ కంటే అత్తరు సాయిబు తో కలహం మేలు
174. పాము కాళ్ళు పామునకెరుక
175. పానకంలో పుడక
176. పాపమని పాత చీర ఇస్తే గోడ చాటుకు వెళ్ళి మూర వేసిందట
177. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్లు
178. పండిత పుత్రః పరమశుంఠః
179. పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్లు
180. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు
181. పట్టి పట్టి పంగనామం పెడితే, గోడ చాటుకు వెళ్ళి చెరిపేసుకున్నాడట
182. పెదవి దాటితే పృథ్వి దాటుతుంది
183. పెళ్ళంటే నూరేళ్ళ పంట
184. పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్ళినట్టు
185. పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరికిందట
186. పెరుగు తోట కూరలో, పెరుగు యెంత ఉందో, నీ మాటలో అంతే నిజం ఉంది
187. పిచ్చి కోతికి తేలు కుట్టినట్లు
188. పిచ్చోడి చేతిలో రాయిలా
189. పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా
190. పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం
191. పిండి కొద్దీ రొట్టె
192. పిట్ట కొంచెము కూత ఘనము
193. పోరు నష్టము పొందు లాభము
194. పోరాని చోట్లకు పోతే , రారాని మాటలు రాకపోవు
195. పొర్లించి పొర్లించి కొట్టినా మీసాలకు మన్ను కాలేదన్నదడట
196. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు
197. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు
198. రాజు గారి దివాణంలో చాకలోడి పెత్తనము
199. రామాయణంలో పిడకల వేట
200. రామాయణం అంతా విని రాముడికి సీత యేమౌతుంది అని అడిగినట్టు
201. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్లు
202. రెడ్డి వచ్చే మొదలెట్టు అన్నట్టు
203. రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు
204. రౌతు కొద్దీ గుర్రము
205. ఋణ శేషం శత్రు శేషం ఉంచరాదు
206. చంకలో పిల్లవాడిని ఉంచుకుని ఊరంతా వెతికినట్టు
207. సంతొషమే సగం బలం
208. సిగ్గు విడిస్తే శ్రీరంగమే
209. శివుని ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు.

Friday, 28 February 2025

మన దేశం మరియు నగరాల అసలు మరియు అందమైన పేర్లు ఏమిటో మీకు తెలుసా


*మన దేశం మరియు నగరాల అసలు మరియు అందమైన పేర్లు ఏమిటో మీకు తెలుసా..?*
                  ➖➖➖✍️

*1. హిందుస్థాన్, ఇండియా లేదా భారత్ అసలు పేరు - ఆర్యవర్త!*

*2. కాన్పూర్*
*అసలు పేరు కన్హాపూర్.*

*3. ఢిల్లీ*
*అసలు పేరు ఇంద్రప్రస్థ.*

*4. హైదరాబాద్*
*అసలు పేరు భాగ్యనగర్.*

*5. అలహాబాద్*
*అసలు పేరు ప్రయాగ్.*

*6. ఔరంగాబాద్*
*అసలు పేరు శంభాజీ నగర్.*

*7. భోపాల్*
*అసలు పేరు - భోజ్‌పాల్!*

*8. లక్నో*
*అసలు పేరు లక్ష్మణపురి.*

*9. అహ్మదాబాద్.*
*అసలు పేరు కర్ణావతి.*

*10. ఫైజాబాద్*
*అసలు పేరు అవధ్.*

*11. అలీఘర్*
*అసలు పేరు హరిగఢ్.*

*12. మీరాజ్*
*అసలు పేరు - శివప్రదేశ్!*

*13. ముజఫర్‌నగర్*
*అసలు పేరు లక్ష్మీ నగర్.*

*14. షామ్లీ*
*అసలు పేరు శ్యామాలి.*

*15. రోహ్తక్*
*అసలు పేరు రోహితాస్పూర్.*

*16. పోర్బందర్*
*అసలు పేరు సుదామపురి.*

*17. పాట్నా*
*అసలు పేరు పాటలీపుత్ర.*

*18. నాందేడ్*
*అసలు పేరు నందిగ్రామ్.*

*19. అజంగఢ్*
*అసలు పేరు ఆర్యగఢ్.*

*20. అజ్మీర్*
*అసలు పేరు అజయమేరు.*

*21. ఉజ్జయిని*
*అసలు పేరు అవంతిక.*

*22. జంషెడ్‌పూర్*
*అసలు పేరు కాళీ మతి!*

*23. విశాఖపట్నం*
*అసలు పేరు విజత్రపశ్మ.*

*24. గౌహతి*
*అసలు పేరు ప్రాగ్జ్యోతిష్‌పురా.*

*25. సుల్తాన్‌గంజ్*
*అసలు పేరు చంపానగరి.*

*26. బుర్హాన్‌పూర్*
*అసలు పేరు బ్రహ్మపూర్.*

*27. ఇండోర్*
*అసలు పేరు ఇందూర్.*

*28. నశ్రులగంజ్*
*అసలు పేరు - భిరుండా!*

*29. సోనిపట్*
*అసలు పేరు స్వర్ణప్రస్థ.*

*30. పానిపట్ *
*అసలు పేరు పర్ణప్రస్థ.*

*31. బాగ్‌పత్*
*అసలు పేరు - బాగ్‌ప్రస్థ!*

*32. ఉస్మానాబాద్*
*అసలు పేరు ధరాశివ్ (మహారాష్ట్రలో).*

*33. డియోరియా*
*అసలు పేరు దేవ్‌పురి.  (ఉత్తరప్రదేశ్‌లో)*

*34. సుల్తాన్‌పూర్*
*అసలు పేరు - కుష్భవన్‌పూర్*

*35. లఖింపూర్*
*అసలు పేరు లక్ష్మీపూర్.  (ఉత్తరప్రదేశ్‌లో)*

*36. మొరెనా*
*అసలు పేరు మయూర్వన్.*

*37. జబల్పూర్*
*అసలు పేరు జబలిపురం*

*38. గుల్మార్గ్*
*అసలు పేరు గౌరీమార్గ్*

*39. బారాముల్లా*
*అసలు పేరు వర్హముల*

*40. సోపోర్*
*అసలు పేరు సుయ్యపూర్*

*41. ముల్తాన్*
*అసలు పేరు ములాస్థాన్*

*42. ఇస్లామాబాద్*
*అసలు పేరు తక్షశిల*

*43. పెషావర్*
*అసలు పేరు పుర్షపుర*

*44. స్కర్డు*
*అసలు పేరు స్కంద*

*45. శ్రీనగర్*
*అసలు పేరు సూర్య నగరం*

*ఈ పేర్లన్నీ మొఘలులు మరియు బ్రిటిష్ వారిచే మార్చబడ్డాయి.

Thursday, 27 February 2025

పెళ్లంటే... తప్పెట్లు, తాళాలు, మూడు ముళ్లు, ఏడడుగులు... అంతేనా?



పెళ్లంటే... తప్పెట్లు, తాళాలు, మూడు ముళ్లు, ఏడడుగులు... అంతేనా?

పెళ్లంటే... రెండు మనసుల కలయిక, నూరేళ్ల సాన్నిహిత్యం...!

పెళ్లంటే... ప్రమాణాలు, వాటికి కట్టుబడి ఉండటం ప్రమాణాలకు కట్టుబడి ఉంటే ఆ సంసారం స్వర్గం.
ప్రమాణాలను అతిక్రమిస్తే ఆ సంసారం నరకం.
మానవజీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం ‘వివాహం.’
ఆ సందర్భంలో వధూవరులతో పలికించే ప్రామాణిక మంత్రాలు...
వాటి అర్థాలపై ప్రత్యేక కథనం...
జీవితంలో ఒకరితో ఒకరిని ఎక్కువకాలం కలిపి ఉంచేది భార్యాభర్తల బంధం. 
ఆ బంధం పటిష్టంగా ఉండటానికి పెద్దలు కొన్ని మంత్రాలను నిర్దేశించారు. వాటినే లౌకికంగా ‘పెళ్లినాటి ప్రమాణాల’ని చెబుతారు. ఆప్రమాణాలను త్రికరణశుద్ధిగా ఆచరించిన దంపతుల సంసారం మూడుపువ్వులు, ఆరుకాయలుగా వర్థిల్లుతుంది. ఆ బంధం నిండునూరేళ్లు పవిత్రంగా, పచ్చగా ఉంటుంది.

వైవాహిక జీవితానికి మూలం...
వివాహం అంటే స్వార్థజీవితం కాదని, జీవితాన్ని ఆనందంగా గడపడమని మహర్షులు చెబుతారు. 

ఆధ్యాత్మిక, సాంఘిక జీవితాన్ని బాధ్యతగా గడుపుతూ ఒకరితో ఒకరు సఖ్యంగా, చనువుగా, ప్రేమగా ఉండటమే దీని మూలమని పెద్దలు వివాహాన్ని నిర్వచించారు.

సంప్రదాయ వివాహాలలో ముఖ్యంగా తొమ్మిది అంశాలు ఉంటాయి. అవి… సమావర్తనం, కన్యావరణం, కన్యాదానం, వివాహహోమం, పాణిగ్రహణం, అగ్నిపరిచర్య, లాజహోమం, సప్తపది, నక్షత్ర దర్శనం.


1.) సమావర్తనం:
పెళ్లితంతులో అత్యంత ప్రధానమైన ‘సమావర్తనం’ అంటే తిరిగిరావటం అని అర్థం. గురుకులంలో విద్యపూర్తయ్యాక, ‘చరితం బ్రహ్మచర్యోహం’ అనే శ్లోకాన్ని గురువుల అనుజ్ఞ కోసం పఠించి, గురువు అనుజ్ఞతో గృహస్థాశ్రమం స్వీకరించడానికి సిద్ధపడడం. వివాహం చేసుకున్నాక, గురువుకు ఇచ్చిన మాటను అతిక్రమించకూడదని ధర్మశాస్త్రం చెబుతోంది.
గృహస్థ ధర్మాన్ని స్వీకరించబోయే సమయంలో...
“రాత్రి సమయంలో స్నానం చేయను, వస్త్రరహితంగా స్నానం చేయను, వర్షంలో తడవను, చెట్లు ఎక్కను, నూతులలోకి దిగను, నదిని చేతులతో ఈదుతూ దాటను, ప్రాణ సంశయం ఏర్పడే సన్నివేశాలోకి ఉద్దేశపూర్వకంగా ప్రవేశించను...”అని పలికిస్తారు.

2.) అంకురారోపణం:
వివాహానికి ముందే కన్యాదాత        ఈ కార్యక్రమం నిర్వర్తిస్తాడు….
పంచపాలికలలో పుట్టమన్ను పోసి నవధాన్యాలను పాలతో తడిపి మంత్రయుక్తంగా వేసి పూజిస్తారు. ఇందులోని పరమార్థం... “కొత్తగా పెళ్లి చేసుకుంటున్న దంపతులారా! భూమిలో విత్తనాలను వేస్తే పంట వస్తోంది. కాబట్టి నేలతల్లిని నమ్మండి, పంట సంతానాన్ని పొందండి!” అని ధర్మసింధు చెబుతోంది.


3.) కన్యావరణం:
కన్యను వరించటానికి రావటాన్ని ‘కన్యావరణం’ అంటారు. మంగళవాద్యాల నడుమ వధువు ఇంటికి వచ్చిన వరుడిని, వధువు తండ్రి గౌరవంగా ఆహ్వానించి మధుపర్కం ఇస్తాడు.

4.) మధుపర్కం:
మధుపర్కమంటే ‘తీయని పానీయం’ అని అర్థం.(కొన్ని చోట్ల బెల్లంతో చేసిన పానకం ఇస్తారు) వరుడికి... తేనె, పెరుగు, బెల్లం కలిపిన మధురపదార్థం తినిపించాక, మధుపర్కవస్త్రాలను ఇస్తారు.
ఎదుర్కోలు సన్నాహం:
ఇరుపక్షాలవారు శుభలేఖలు చదివి, ఒకరికొకరు ఇచ్చుకుని, పానకం అందచేస్తారు.

5.) కన్యాదానం- విధి:
వధువు తండ్రి, తన కుమార్తెను మరో పురుషుడికి కట్టబెట్టడమే కన్యాదానం. కన్యాదానం చేసేటప్పుడు వల్లించే మంత్రాలు...
అష్టాదశవర్ణాత్వియకం కాన్యపుత్రవత్పాలితామయా
ఇదానిల తపదాస్వామి దత్తాం స్నేహేన పాలయం
‘కుమారుడితో సమానంగా పెంచుకొన్న ఈ కన్యను నీకు ఇస్తున్నాను. నీవు ప్రేమాభిమానాలతో కాపాడుకో’
‘శ్రీలక్ష్మీనారాయణ స్వరూపుడైన వరునికి ఇదిగో నీళ్లు... అంటూ వరుడి పాదాలు కడుగుతారు.
‘పితృదేవతలు తరించడానికి ఈ కన్యను నీకు దానం చేస్తున్నాను. సమస్తదేవతలు, పంచభూతాలు నేను చేస్తున్న ఈ దానానికి సాక్షులుగా ఉందురుగాక’ ‘అందంగా అలంకరించిన సాధుశీలవతి అయిన ఈ కన్యను ధర్మకామార్థ సిద్ధికోసం ప్రయత్నం చేస్తున్న ఈ సాధుశీలుడైన బుద్ధిమంతునికి దానంగా ఇస్తున్నాను’
‘ధర్మబద్ధంగా సంతానం పొందడానికి, ధర్మకార్యాలు నిర్వహించడానికి ఈ కన్యను ఇస్తున్నాను’  వధువు తండ్రి ‘పృణీద్వం’ (వరించవలసినది) అంటాడు. 
అప్పుడు వరుడు…‘పృణేమహే’(వరిస్తున్నాను) అంటాడు.
ఆ తరువాత వధువు తండ్రి వరునితో,
“నేత్రాయ పౌత్రపుత్రా లక్ష్మీం కన్యాంనామ్నీం
ధర్మేచ అర్థేచ కామేచ త్వయైషా నాతిచరితవ్య
‘ధర్మంలోనూ, అర్థంలోనూ, కామంలోనూ లక్ష్మీస్వరూపిణి అయిన ఈ కన్యను అతిక్రమించనివాడవై ఉండు!’ అని పలికిన వధువు తండ్రితో, ‘నాతిచరామి’ (అతిక్రమించను) అని వరుడు మూడుసార్లు వాగ్దానం చేస్తాడు. 

ఇది వేదోక్త మంత్రార్థం. ఆ మాటకు అంత మహత్తు ఉంది. అలా అన్న తరవాతే వరుడి పాదాలను కడిగి, కన్యాదానం చేస్తారు.


6.) యోక్త్రధారణం: 
యోక్త్రం అంటే దర్భలతో అల్లిన తాడు. వివాహ సమయంలో వరుడు దీనిని వధువు నడుముచుట్టూ కట్టి ముడి వేస్తాడు. ఈసమయంలో వరుడు...
“ఆశాసానా సౌమ నవ ప్రజాం సౌభాగయం తను మగ్నే,
రనూరతా భూత్వా సన్న హ్యే సుకృతాయ కమ్” అంటాడు.
‘ఉత్తమమైన మనస్సును, యోగ్యమైన సంతానాన్ని, అధికమైన సౌభాగ్యాన్ని, సుందరమైన తనువును ధరించి, అగ్నికార్యాలలో నాకు సహచారిణివై ఉండు. ఈ జీవిత యజ్ఞమనే మంగళకార్యాచరణం నిమిత్తమై వధువు నడుముకు దర్భలతో అల్లిన తాటిని కడుతున్నాను...’ అనేది ఈ మంత్రార్థం.


7.) జీలకర్ర , బెల్లం :
వధూవరులు... జీలకర్ర, బెల్లం కలిపిన మెత్తని ముద్దను శిరస్సు భాగం లో, బ్రహ్మరంధ్రం పైన ఉంచుతారు. 

ఒకరిపట్ల ఒకరికి అనురాగం కలగడానికి, భిన్నరుచులైన ఇద్దరూ ఏకం కావడానికి, పరస్పర జీవశక్తుల ఆకర్షణకు తోడ్పడేలా మనసు సంకల్పించటం దీని అంతరార్థం. 
ఈ సమయంలో “ఆభ్రాతృఘ్నీం వరుణ ఆపతిఘ్నీం బృహస్పతే లక్ష్యం తాచుస్యై సవితుస్సః” వరుణుడు, సోదరులను వృద్ధిపరచుగాక. బృహస్పతి, ఈమెను భర్తవృద్ధి కలదిగా చేయుగాక. సూర్యుడు, ఈమెను పుత్రసంతానం కలదానిగా చేయుగాక” అని అర్థం. 
ఇదే అసలైన సుముహూర్తం.


8.) మంగళ సూత్రధారణ :
(తాళి... తాటి ఆకులను గుండ్రంగా చుట్టి, పసుపు రాసి, పసుపుతాడు కడతారు. దానిని తాళిబొట్టు అంటారు. తాళవృక్షం నుంచి వచ్చింది).
వరుడు వధువు మెడలో మంగళసూత్రాన్ని ముడి వేస్తూ ఈ కింది మంత్రాన్ని పఠించాలి…
“మాంగల్య తంతునానేన మమజీవన హేతునా
కంఠే బధ్నామి సుభగే త్వం జీవశరదాశ్శతం”

‘నా జీవానికి హేతువైన ఈ సూత్రాన్ని నీకంఠాన మాంగల్యబద్ధం చేస్తున్నాను. నీవు నూరు సంవత్సరాలు జీవించు... అని దీని అర్థం.

*పాణిగ్రహణము:
ధృవంతే రాజా వరుణో ధృవం దేవో బృహస్పతిః
ధృవంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధృవం॥

చంద్రుడు (మనస్సు), బృహస్పతి (కాయం), అగ్నిహోత్రుడు (వాక్కు) ...     వీరు ముగ్గురి నుంచి బతిమాలి, వధువును తీసుకువస్తాడట వరుడు. అంటే త్రికరణశుద్ధిగా కాపురం బావుంటుంది అని అర్థం!

(కన్య పుట్టగానే కొంతకాలం చంద్రుడు, కొంతకాలం గంధర్వుడు, కొంతకాలం అగ్ని కాపాడతారట. ఆ తరువాత వారి ముగ్గురిని అడిగి వరుడు వధువును తీసుకువస్తాడట).

‘సోముడు నిన్ను గంధర్వుడికిచ్చాడు, గంధర్వుడు అగ్నికిచ్చాడు, నేను నిన్ను కాపాడవలసిన నాలుగవవాడను’ అని అభిమంత్రించి పెళ్లికూతురు చేయి పట్టుకొంటాడు. ఇదే పాణిగ్రహణం.

*తలంబ్రాలు: 
దీనినే అక్షతారోహణంగా చెబుతారు. అక్షతలు అంటే నాశం లేనివి. 
వీరి జీవితం కూడా నాశనరహితంగా ఉంటుందని చెప్పడం కోసమే ఈ తంతు. 

ఇందులో ముందుగా... ఒకరి తరవాత ఒకరు కొన్ని మంత్రాలు ఉచ్చరించాక వేడుక ప్రారంభం అవుతుంది. సంతానం, యజ్ఞాది కర్మలు, సంపదలు, పశుసంపదలు కలగాలని భార్యాభర్తలు వాంఛిస్తారు.


9.) సప్తపది:
ఏడడుగులు నడిస్తే సంబంధం దృఢపడుతుందట. ఈ ఏడడుగులు ఏడేడు జన్మల అనుబంధాన్నిస్తుంది. వరుడు వధువుని చేయి పట్టుకొని అగ్నిహోత్రానికి దక్షిణంగా కుడికాలు ముందుకి పెడుతూ, ఏడు మంత్రాలు చెబుతాడు. ఇదే సప్తపది. 
ఇందులో వరుడు వధువుని ఏడు కోరికలు కోరతాడు. అన్నం, బలం, ప్రతిఫలం, వ్రతాదికం, పశుసంపద, సంతానం, ఋషుల అనుగ్రహం కలగాలని ఒక్కో అడుగూ వేస్తూ చదువుతారు.
ఈ మంత్రాలను త్రికరణశుద్ధిగా వల్లిస్తూ, అందులోని పరమార్థాన్ని అర్థం చేసుకోవాలని, ‘పెళ్లినాడు చేసే ప్రమాణాల’ను అతిక్రమించకూడదని, వీటికోసం ఎన్ని కష్టాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని మహర్షులు చెప్పారు. 
ప్రమాణాలను నిలబెట్టుకున్న నాడు వివాహవ్యవస్థ పటిష్టంగా ఉంటుందనే పెద్దల వాక్కు ఆచరణీయం.


**కొత్త బంధాలు, పరిచయాలు :

మానవజీవితంలోని అన్ని సంస్కారాలలోకీ అతి ముఖ్యమైనది వివాహం. దీనితో రెండు జీవితాల బంధం ముడిపడి ఉంటుంది. మూడుముళ్ల బంధంతో వివాహజీవితం కొనసాగుతుంది. వివాహంలో అతి ముఖ్యమైన ఘట్టాలు స్నాతకం, కాశీయాత్ర, కన్యాదానం, శుభముహూర్తం, మంగళసూత్రధారణ, తలంబ్రాలు, సప్తపది, అరుంధతీ దర్శనం. ఈ కార్యక్రమాలు పురోహితుల వేదమంత్రాల మధ్య, బంధుమిత్రుల శుభాశీస్సుల మధ్య వైభవోపేతంగా జరుగుతుంది. వివాహంతో ఇరువర్గాల బంధువుల మధ్య కొత్త పరిచయాలు, కొత్త బంధాలు, అను బంధాలు కలుగుతాయి.


**ఆత్మల అనుసంధానం :

మానవుడు... కడుపులో ఉన్నప్పటి నుంచి, తనువు చాలించేవరకు మొత్తం 16 కర్మలు ఉంటాయి. వాటిల్లో వివాహం అతి ప్రధానమైనది, స్త్రీపురుషులు కలిసి ధర్మార్థకామమోక్షాలను సాధించుకోవడమే వివాహ పరమార్థం.

జీవిత భాగస్వామ్య వ్యవస్థ నుంచి రెండు ఆత్మలుగా ఏకమవ్వడమే వైవాహిక జీవితం. పెళ్లితో స్త్రీపురుషుల అనుబంధానికి నైతికత ఏర్పడుతుంది. లౌకికంగా ఏర్పడే అన్ని అనుబంధాలలోకి వివాహబంధం అతి ముఖ్యమైనది, పవిత్రమైనది. పెళ్లి వెనుక ఉన్న సృష్టి రహస్యం, పెళ్లి పేరుతో జరిగే మంత్రోచ్చారణలు అన్నీ కలిసి దంపతులను సృష్టి నిలబెడుతున్నాయి .
 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

Monday, 24 February 2025

శివరాత్రి జాగారం

.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

           శివరాత్రి జాగారం
     ఉపవాసం ఎందుకు చేస్తారో     
                  తెలుసా ?
 
 శివరాత్రి పర్వదినాన ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ శివ నామ స్మరణతో మారుమోగిపోతాయి.

*శివారాధనలో లింగరూపంలో పూజిస్తారు. ప్రతి లింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని నమ్మకం.*

*వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రధానమైనవి. మహాశివరాత్రి పర్వదినాన శివాలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు , పూజలతో పరమశివుని ఆరాధిస్తారు. దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు.*

*రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు , భజనలతో శివనామం మారుమోగుతుంటుంది.*

*ఈ పర్వదినాన లింగాష్టకం , శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి , భక్తి ప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతుల కల్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో , చింతనలో గడిపి , రాత్రి జాగారం చేస్తారు. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం ముఖ్యం.*

*అసలు శివరాత్రి విశిష్టత ఏమిటి ? ఆ రోజు ఉపవాసం ఎందుకుంటారు ? జాగారం ఎందుకు చేస్తారు ? జాగారం ఎవరు , ఎప్పుడు ప్రారంభించారు ?* 

*అంటే దానికి ఒక కథ ఉంది…. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేశారు. అప్పుడు అమృతం కంటే ముందు హాలాహలం పుట్టింది. హాలాహలాన్ని అలాగే విడిచిపెట్టేస్తే అది ముల్లోకాలనూ దహించేసే ప్రమాదం ఉండటంతో దేవదానవులందరూ భయాందోళన చెందారు. హాలాహలం బారి నుంచి లోకాలను రక్షించాలంటూ మహాదేవుడైన శంకరుడిని శరణు వేడారు. లోక రక్షణ కోసం ఆ గరళాన్ని తానే మింగి , గొంతులో బంధించి అలా గరళకంఠుడయ్యాడు. హాలాహల ప్రభావానికి శివుడి కంఠం కమిలి , నీలంగా మారడంతో నీలకంఠుడిగా పేరుపొందాడు. గరళాన్ని గొంతులో బంధించడం వల్ల అది శివునిలో విపరీతమైన తాపాన్ని పుట్టించసాగింది. ఆ తాపాన్ని తగ్గించుకోవడానికి క్షీరసాగర మథనంలో పుట్టిన చంద్రుడిని తలపై ఉంచుకున్నాడు. నిరంతర తాపోపశమనం కోసం గంగను కూడా నెత్తిన పెట్టుకున్నాడు.*

*అయినా, శివుడిని హాలాహల తాపం ఇబ్బంది పెడుతూనే ఉంటుందట. అందుకే భక్తులు నిత్యం శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు. హాలాహలం మింగినప్పుడు దాని ప్రభావానికి శివుడు మూర్ఛిల్లాడట. ఆందోళన చెందిన దేవతలు శివుడికి మెలకువ వచ్చేంత వరకు జాగారం చేశారట. అందుకే ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేసి, జాగారం ఉంటారు. జాగారం ఉన్న సమయంలో శివనామ సంకీర్తనతోనూ , జప ధ్యానాలతోనూ కాలక్షేపం చేస్తారు. ఇదంతా మహాశివరాత్రి పర్వదినానికి గల పౌరాణిక నేపథ్యం. నిజానికి శివారాధన పురాణాలకు ముందు నుంచే ఉనికిలో ఉంది.*

*క్రీస్తుపూర్వం 3వేల ఏళ్ల నాడే సింధులోయ నాగరికత విలసిల్లిన కాలంలో శివుడిని పశుపతిగా ఆరాధించేవారు.

*#శివుడి అభిషేకం యొక్క గొప్పతనం*

శివరాత్రి సందర్భంగా…

1) శివుని రుద్రాభిషేకం చాలా శక్తివంతమైనది 

2) ఈ విశ్వంలో శివాభిషేకంతో సాధించలేనిది ఏదీ లేదు

3) దీనిని రుద్ర నమక చమకంతో చేస్తారు 

4) జ్ఞానం, ఆరోగ్యం & సంపదకు మూలం శివుడే

5) మనిషి సమస్యలన్నీ కూడా శివాభిషేకం ద్వారా పరిష్కరించబడతాయి

6) మానవుల కోరికలు అన్నీ కూడా శివాభిషేకంతో సాధించబడతాయి

7) శివాభిషేకంతో మొత్తం ఈ విశ్వం చల్లబడుతుంది

8) అందుకే శివ లింగం ఎండిపోకుండా - ఎప్పుడూ చుక్క చుక్కగా నీళ్ళు పడేలా ఉంచుతారు

9) శివుడు తనంతట తానుగా కోపం తెచ్చుకోడు. ఆయన ఎప్పుడూ తనలో తాను రమిస్తూ ఉంటాడు

10) పార్వతీదేవి శివుడిని రుద్రునిగా మారుస్తుంది & రుద్రుడిని శివునిగా మారుస్తుంది

11) శివపార్వతులు ఈ విశ్వానికి తల్లిదండ్రులు అని భావిస్తాము
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷



🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

Tuesday, 11 February 2025

మాఘ పూర్ణిమ

*🚩_నేడు మాఘ పూర్ణిమ ,  మాఘ పూర్ణిమ ప్రత్యేకత_🚩* 

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*మాఘ పౌర్ణమి*

హిందువులు పౌర్ణమి తిథిని చాలా పవిత్రంగా భావిస్తారు. పౌర్ణమి తిథి ప్రతి నెల శుక్లపక్షంలోని చివరి తేదీ.. కొత్త నెల ఆ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 12 న వచ్చింది. ఈ రోజున దాతృత్వం , గంగా స్నానం చేయడం మిక్కిలి ఉత్తమం. ఈరోజున చంద్రుడు తన పూర్తి కళలతో ఉదయిస్తాడని చెబుతుంటారు.

చైత్రాది పన్నెండు మాసాలకూ ఏదో ఒక ప్రత్యేకత వుంది.
కార్తీక మాసం దీపాలకూ , దీపారాధనలకు ప్రసిద్ధి.
మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి.
*"మా - అఘం''* అంటే పాపం ఇవ్వనిది అని అర్థం. కనుకనే మాఘమాసం అన్నారు.

*"మాఘమాసేరటం తాప్యః కించి దభ్యుదితే రవౌ*

*బ్రహ్మఘ్నం వా సురాపం వా కంపతంతం పునీమహే''*

*"ఈ మాఘమాసమందు సూర్యోదయమునకు పూర్వమే , అనగా ... బ్రాహ్మీముహూర్తము  నుంచి జలములన్నియు బ్రహ్మహత్య , సురాపానము వంటి మహా పాతకములను పోగొట్టి మానవులను పవిత్రులుగా చేయుటకు సంసిద్ధముగా వుండును''*  అని అర్థం.

అందుకనే మాఘమాసం నెలరోజులు పవిత్రస్నానాలు చేయాలని మన ఋషులు నిర్ణయించారు.

*☘మాఘం అమోఘం :☘*

మాఘమాసానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ మాసానికి పరిపోషకుడు మాధవుడు. *"మా'' అంటే మహాలక్షీ. "ధనుడు''* అంటే భర్త. మాధవుడు అంటే లక్ష్మీదేవికి భర్త అని అర్థం. అందుకే శ్రీమహాలక్ష్మీ కూడా ఈ మాసాన్ని ఎంతగానో ఇష్టపడుతుంది. లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన మాసం కనుక శ్రీవైష్ణవులకు ఈ మాఘమాసం ఎంతో ప్రధానమైనది. విద్యాధిదేవత , వాగ్దేవి , జ్ఞానప్రదాయిని అయిన సరస్వతీదేవి ఈ మాఘమాసంలోనే శుద్ధ పంచిమినాడు జన్మించింది. అందుకే మాఘశుద్ధ పంచమిని *"శ్రీపంచమి''* అని అంటారు. "శ్రీ'' అంటే లక్ష్మీదేవి అనే కదా మనందరి అభిప్రాయం.

*"శుద్ధలక్ష్మీ: మోక్షలక్షీ: జయలక్ష్మీహ సరస్వతే*

*శ్రీర్లక్ష్మీ: వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమసర్వదా''*

మానవునకు అవసరమైన ఆరు సంపదలలోను విద్యాసంపద ఒకటి. కనుకనే శ్రీమహాలక్ష్మీ *"శ్రీపంచమి''* నాడు సరస్వతీదేవి రూపంలో భాసిస్తుంది. ఈ రోజునే తల్లిదండ్రులు తమ పిల్లలకు *"అక్షరభ్యాసం''* జరిపిస్తారు. ఈ మాఘమాసంలోనే ఆరోగ్యప్రదాత అయిన సూర్యుడు సప్తమి తిథినాడు జన్మించాడు. అందుకే మాఘశుద్ధసప్తమి *"రథసప్తమి''* పర్వదినం అయింది. లయకారుడైన పరమేశ్వరుడు లింగాకారంలో ఉద్భవించి మాఘ బహుళ చతుర్ధశిని *"శివరాత్రి''* పర్వదినం చేశాడు. విష్ణుసహస్రనామ స్తోత్రాన్ని సర్వమానవాళికి అందించిన భీష్మ పితామహుడు ఈ మాఘ శుద్ధ అష్టమినాడు పరమపదం చేరి , మాఘశుద్ధ ఏకాదశి *"భీష్మ ఏకాదశి''* పర్వదినం చేశాడు.

త్రిమతాచార్యులలో ఒకరైన *"మధ్వాచార్యుడు''* ఈ మాఘశుద్ధ నవమినాడు వైకుంఠ ప్రాప్తి పొందాడు. ఈ రోజున ఉడిపి కృష్ణుని మనం చూడగలుతున్నామంటే అందుకు మధ్వాచార్యుని కరుణాకటాక్షమే కారణం. అందుకే మాఘశుద్ద నవమిని *"మధ్వనవమి''* గా పాటిస్తూ ఉడిపి క్షేత్రంలో ఎంతో కోలాహాలంగా కృష్ణునికి విశేషమైన ఉత్సవాలు , వేడుకలు చేస్తారు.
జ్యోతిషశాస్త్ర ప్రకారం ఈ మాసాన్ని *"కేతువు''* పరిపాలిస్తూంటాడు. కేతువు జ్ఞానప్రదాత , మోక్షకారకుడు. కనుక ఈ మాసంలో కేతువు విశేష పూజలు అందుకుంటాడు. చాంద్రమానం ప్రకారం చంద్రుడు *"మఖ''* నక్షత్ర మండలంతో కూడి వుండే మాసం కనుక ఈ మాసానికి *"మాఘమాసం"* అనే పేరు వచ్చింది. అందుకే మాఘం - అమోఘం .
 
*☘పితృయజ్ఞానికి ప్రాధాన్యత :☘*

మాఘ అమావాస్య పితృకార్యాచరణకు ఎంతో ప్రధానమైన రోజు. ఆ రోజున పైతృకం చేస్తే పితృదేవతలు పదివేల సంవత్సరాల పాటు స్వర్గసుఖాలు అనుభవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. సాధారణంగా గ్రహణకాలాలు, సంక్రమణాలు *"పైతృకాలకు''* ఎంతో అనువైన కాలాలుగా భావిస్తారు. అయితే , ఆదివారం , అమావాస్య , శ్రవణనక్షత్రం , వ్యతీపాత యోగం అన్నీ ఒకేరోజున కలిసివస్తే దాన్ని *"అర్ధోదయ పుణ్యకాలం''* అంటారు. అది గ్రహణకాలం కన్నా గొప్పదని శాస్త్రాలు చెబుతున్నాయి. పైగా మాఘ అమావాస్య , శతభిష నక్షత్రంలో కూడి వుంటే మరింత విశేషమని ధర్మసింధువు చెబుతుంది. కనుక , ఈ మాఘ అమావాస్య నాడు పితృదేవతలను స్మరిస్తే, పుత్రధర్మాన్ని నిర్వర్తించిన వారిమౌతాం. 

*☘మాఘపూర్ణిమ - మహామాఘి :☘*

మాఘమాసం స్నానాలకు ప్రసిద్ధి అని చెప్పుకున్నాం కదా ! నిజానికి మకర సంక్రమణం జరిగినది మొదలు కుంభసంక్రమణం జరిగేవరకు మధ్య ఉండే మధ్యకాలమే *"మాఘమాసం''*. పవిత్రస్నానాలు పౌష్య శుక్ల పూర్ణిమతో మొదలై మాఘశుక్ల పూర్ణిమతో ముగుస్తాయి. చాంద్రమానం అనుసరించేవారికి ఈ మాఘమాసం పౌష్య బహుళ అమావాస్యతో ప్రారంభమై మాఘ బహుళ అమావాస్యతో ముగుస్తుంది. ఈ మాఘమాసం మొత్తం పవిత్రస్నానాలు చేయడం విశేష పూర్వప్రదం. కానీ , ఈ యాంత్రిక జీవితంలో అది సాధ్యం కానీ పని తెలిసే ... కనీసం *"మాఘపూర్ణిమ''* నాడైనా నదీస్నానం గానీ , సముద్రస్నానం గానీ చేస్తే మాఘమాసం మొత్తం పవిత్రస్నానాలు చేసిన ఫలితం వస్తుందని పెద్దలంటారు. ఎందుకంటే మాఘపూర్ణిమను *"మహామాఘి''* అని అంటారు. సంవత్సరంలో వచ్చే 12 పూర్ణిమలలోనూ *"మాఘ పూర్ణిమ''* అత్యంత విశేషమైనది. ఈ *"మహామాఘి''* శివ , కేశవులిద్దరికీ ప్రీతికరమైనది. అందుకే ఈ మాఘ పూర్ణిమ నాడు తప్పకుండా సముద్రస్నానం చేసితీరాలి. శివ , కేశవులిద్దరినీ ఆరాధించి తరించాలి. 

*☘సముద్ర స్నానం ఎందుకు చేయాలి?☘*

 *"నదీనాం సాగరో గతి:''*

సకల నదీ , నదాలు చివరకు సముద్రంతోనే సంగమిస్తాయి. కనుక , సముద్రస్నానం చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది. ముఖ్యంగా సముద్రుడి ప్రత్యేకత ఏమిటంటే ... ప్రతినిత్యం సూర్యకిరణాలవల్ల , ఎంతో నీరు ఆవిరి అవుతున్నా సముద్రం యొక్క పరిమాణం తగ్గదు. అలాగే , ఎన్నో జీవనదులు తనలో కలుస్తున్నా సాగరుని పరిమాణం పెరగదు. స్థిరత్వం ఆయన ధర్మం. 
అఘాది , జడత్వాలు ఆయన తత్త్వం.
సాగరుడు సంతోశప్రదుడు. సంవత్సరంలో నాలుగుసార్లు సాగరస్నానం చేయాలనీ, అవి కూడా *"ఆషాఢ పూర్ణిమ , కార్తీక పూర్ణిమ , మాఘపూర్ణిమ , వైశాఖ పూర్ణిమ''* లలో చేయాలని , ఆలా సాగరస్నానాలు చేసినవారికి సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యం కలుగజేస్తాడని పురాణాలు చెప్పాయి. *"స్నానం''* అంటే *"షవర్ బాత్''* చేయడమో , *"స్విమ్మింగ్ పూల్''* లో చేయడమో కాదు. నదీప్రవాహ వేగానికి ఎదురుగా నడుము మునిగే వరకూ నిలబడి , కనీసం 48 నిమిషాల పాటు స్నానం చేయాలని విధి. అది కూడా సూర్యోదయానికి గంటన్నర ముందు కాలంలోనే చేయాలి. ఏమిటీ ఛాదస్తం అని విసుక్కోవద్దు. ఛాదస్తం కాదు , సైన్స్. నీటిలో విద్యుచ్చక్తి ఉందని సైన్సు చెబుతుంది. కానీ ఈ సైన్సు పుట్టుక ముందే ఈ సత్యాన్ని గుర్తించిన మన మహర్షులు బ్రాహ్మీ ముహూర్తాన్ని నదీస్నానానికి అనుకూల సమయంగా నిర్ణయించారు.

సూర్యోదయకాలం నుంచి , సూర్యాస్తమయం వరకూ ప్రసరించే సూర్యకిరణాలలోని విద్యుచ్చక్తిని నదీజలాలు , సాగర జలాలు తమలో నిక్షిప్తం చేసుకుంటాయి. తన వెండి వెలుగులతో జగతిని జ్యోత్స్నామాయం చేసే చంద్రుడు తన కిరణాలలోని అమృతత్త్వాన్ని , ఔశదీ విలువలను నదీజలాలకు అనుగ్రహిస్తాడు. నీటిలో వుండే ఈ అద్భుతశక్తులు ... తిరిగి సూర్యకిరణాలకు పరావర్తనం చెంది అంతరించి పోతాయి. అందుకే సూర్యోదయానికి పూర్వమే స్నానం పూర్తి చేయాలనే నియమాన్ని విధించారు పెద్దలు. మరి *"నడుము మునిగే వరకూ ఎందుకు నదీ ప్రవాహ వేగానికి ఎదురుగా ఎందుకు నిలబడాలి"* అన్న సందేహం రావచ్చు. గర్భస్థ శిశువుగా ఉన్న పిండానికి నాభినాళం ద్వారానే జీవశక్తులు అందుతాయన్నది ఎవరూ కాదనలేని సత్యం. సాగర , నదీజలాలలో నిక్షిప్తమై వున్నా సౌరశక్తి , సోమశక్తులు , ఈ నాభినుంచి శరీరం గ్రహిస్తుంది. అందుకే నాభి మునిగే వరకూ నదిలో నిలబడి స్నానం చేయాలి. సముద్రానికి ప్రవాహం లేకపోయినా , ఉత్తుంగ తరంగాలు తమ తాకిడితో ఆ శక్తులను శరీరానికి అందజేస్తాయి. కనుకనే సముద్రుణ్ణి పూజిస్తూ చేసే నాలుగు స్నానాలలో *"మాఘ పూర్ణిమ''* స్నానం ముఖ్యమైనది.

సముద్రం , నదులు అందుబాటులో లేనివారి పరిస్థితి ఏమిటి ? అనే సందేహం కలుగుతుంది. అలాంటి పరిస్థితిలో బావుల దగ్గరగానీ , చెరువుల వద్దగానీ *"గంగ , సింధు , కావేరి , కృష్ణ , గౌతమి''* నదుల పేర్లు స్మరిస్తూ స్నానం చేస్తే ఆయా నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది. దేనికైనా భక్తి ప్రధానం. అది లేనప్పుడు ఎన్నిసార్లు కాకిలా మునిగి , కర్రలా తేలినా ఫలితం శూన్యం. 

*☘మాఘ పూర్ణిమ స్నానఫలం :☘*

1 . *ఇంటిలోనే వేడినీళ్ళతో స్నానం చేస్తే ఆరు సంవత్సరాలు శుభ్రంగా స్నానం చేసిన ఫలితం లభిస్తుంది.*

2 . *బావి నీళ్ళతో స్నానం చేస్తే , 12 సంవత్సరాల పుణ్యస్నాన ఫలితం వస్తుంది.*

3 . *చెరువులో స్నానం చేస్తే 24 సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది.*

4 . *సాధారణ నదిలో స్నానం చేస్తే 96 సంవత్సరాల పుణ్యస్నానఫలం లభిస్తుంది.*

5 . *పుణ్యనదీ జలాలలో స్నానం చేస్తే 9,600 సంవత్సరాల పుణ్యస్నానఫలం లభిస్తుంది.*

6 . *సంగమస్థానాలలో స్నానం చేస్తే 38,400 సంవత్సరాల పుణ్యస్నానఫలం లభిస్తుంది.*

7 . *గంగానదిలో స్నానం చేస్తే 3 కోట్ల 84 లక్షల సంవత్సరాల పుణ్యస్నానఫలం లభిస్తుంది.*

8 . *ప్రయాగలోని త్రివేణీ సంగమంలో స్నానం చేస్తే ... గంగా స్నానం వలన కలిగే ఫలితం కన్నా నూరురెట్లు అధికఫలం కలుగుతుంది.*

9 . *సముద్రస్నానం చేస్తే వచ్చే పుణ్యఫలాన్ని చెప్పడానికి మాటలు చాలవు.*

ఈ మాఘమాసం మొత్తం పవిత్రస్నానాలు చేయడానికి వీలు కుదరకపోతే , మాఘమాసం చివరి మూడురోజులైనా పవిత్రస్నానాలు చేస్తే మంచి ఫలాన్ని పొందవచ్చు. చివర మూడు స్నానాలనూ *"అంత్యపుష్కరిణీ స్నానాలు''* అంటారు. సాధారణ స్నానం శరీర మలినాన్ని పోగొడితే , మాఘమాసం , మనసులోని మాలిన్యాన్ని పోగొట్టి మాధవుని సన్నిధికి చేరుస్తుంది.
 

*☘మాఘస్నానం చేస్తున్నప్పుడు :-☘*
    *"దుఃఖదారిద్యనాశాయ శ్రీవిష్ణోస్తోషణాయాచ*

*ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘేపాపవినాశనం*

*మకరస్దే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ*

*స్నానేనానేన మే దేవ యథోక్త ఫలదో భావ''* 

అని పఠించి , మౌనంగా స్నానం చేయాలి , అంటే *"దుఃఖములు , దారిద్ర్యము నశించుటకు పాపక్షయమగుటకు శ్రీవిష్ణుప్రీతి పూర్వకముగ ఈ పవిత్ర మాఘ స్నానము చేయుచున్నాను. కనుక ఓ గోవిందా ! అచ్యుతా ! మాధవా ! ఈ స్నానమునకు యథోక్తఫలము అనుగ్రహించు''* అని అర్థం. 
ఆ తరువాత ...
*"సవిత్రే ప్రసవితే చ పరంథామ జలేమమ*   

*త్వత్తేజసా పరిభష్టం పాపం యాటు సహస్రథా''*

అని సూర్యునకు ఆర్ఘ్యప్రదానం చేయాలి. అంటే *"ఓ పరంజ్యోతి స్వరూపుడా ! నీ తేజస్సుచే నా పాపములు సర్వము వేయి తునాతునకలుగా వ్రక్కలై ఈ జలములందు బడి నశించుగాక''* అని అర్థం.
ఈ విధంగా మాఘస్నానం చేసిన తరువాత , పితృతర్పణాది నిత్యకర్మలు పూర్తిచేసుకుని , ఇష్టదైవాన్ని ఆరాధించాలి. ఆ తర్వాత , దానధర్మాలు చేయాలి. వస్త్రములు , కంబలములు (దుప్పటిలు), పాదరక్షలు , గొడుగు , తైలము , నెయ్యి , తిలపూర్ణఘటము , బంగారము , అన్నము మొదలైనవి దానం చేస్తే మహాపుణ్యఫలం లభిస్తుంది. చేయగలితే సమర్థత , అవకాశం ఉన్నవారు *"నేతితో తిలహోమం''* చేస్తే మరింత పుణ్యం కలుగుతుంది.
 
*☘తిలల (నువ్వులు)కున్న ప్రత్యేకత :☘*

నువ్వులు అంటే సాక్షాత్తు శనైశ్చరునికి ప్రతిరూపమని , వాటిని తాకితేనే కష్టాలు చేరువ అవుతాయి అనే అపోహ మనలో చాలామందికి ఉంది. అది తప్పు.
శ్రీమహావిష్ణువు స్వేదబిందువులే *"తిలలు''* ... అనగా నువ్వులు.
తిలలు సాక్షాత్తు విష్ణు స్వరూపాలు. ఇవి ఈశ్వర ప్రతీకాలు. అందుకే , శివునకు ఏకదశ రుద్రాభిషేకం చేసేటప్పుడు ప్రత్యేకంగా తిలలతో అభిషేకిస్తారు. తిలలకు అంతటి విశిష్టస్థానం వుంది. కనుక ఈ మాఘమాసం నెలరోజులూ ఒకవంతు చెక్కరకు , మూడువంతులు తిలలు కలిపి  శ్రీహరికి నివేదన చేసి , అందరికీ ప్రసాదంగా పంచిపెట్టమని శాస్త్రం చెబుతుంది.
మాఘపూర్ణిమనాడు *"తిల పాత్రదానము''* చేయడం బహుప్రశస్తము. ఈ దానము ఎలా చేయాలంటే , ఒక రాగి పాత్ర నిండుగా తిలలు పోసి , వాటిపైన శక్తికొలది సువర్ణము నుంచి -

*"వాజ్మానః కాయజ త్రివిధ పాపనాశపూర్వకం*

*బ్రహ్మలోకా వాప్తి కామ స్తిల పాత్ర దానం కరిష్యే''* అని సంకల్పించి -

*"దేవదేవజగన్నాథ వంఛితార్ధ ఫలప్రద*

*తిలపాత్రం ప్రదాస్వామి తవాగ్రే సంస్థితో వ్యూహం''*

అని శ్రీమహావిష్ణువును స్మరిస్తూ ఆ తిలపాత్రను ఒక బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. ఈ దానంతో మనోవాంఛితము నెరవేరునని శాస్త్రప్రమాణము. ఈ తిలపాత్ర దానము , జాతకరీత్యా శనిదోష , పీడా నివారణార్థం కాదని మాత్రం గుర్తుంచుకోండి. 

*☘చివరగా ఓ మాట☘*

మాఘమాసం నెలరోజులూ పవిత్రస్నానాలు చేయాలనీ , ముఖ్యంగా మాఘపూర్ణిమనాడు సముద్రస్నానం చేయాలని , అందువలన కలిగే ఫలం అధికం అని చెప్పుకున్నాం కదా ! పూర్ణిమకు సముద్రస్నానానికి ఏమిటి సంబంధం అనే సందేహం కలుగవచ్చు. ప్రతి పూర్ణిమకు , అమావాస్యకు సముద్రానికి *"పోటు''* ఎక్కువగా ఉంటుంది. *"పూర్ణిమ''* దైవసంబంధమైన తిథి ... అమావాస్య పితృదేవతలకు సంబంధించిన తిథి. అందుకు ఈ పుణ్యతిథులలో సముద్రస్నానం చేయాలని శాస్త్రనియమం. 
జ్యోతిష శాస్త్ర రీత్యా పూర్ణిమ తిథినాడు రవి , చంద్రులు ఒకరికొకరు సమసప్తక కేంద్రగతులై పరస్పరం వీక్షించుకుంటారు. అమావాస్యనాడు రవి , చంద్రులు ఒకే కేంద్రంలో కలిసి వుంటారు. రవి , చంద్రులకు , సముద్రానికి ఉన్న సంబంధం ముందే తెలుసుకున్నాం కదా ! ఇక ఆలస్యం ఎందుకు ? మాఘస్నానాలకు ఉపక్రమించండి. పుణ్యంతో పాటు ఆరోగ్యాన్ని , ఆనందాన్ని అందుకుని తరించండి.

*ఓం నమో భగవతే వాసుదేవయ* మంత్రాన్ని జపించడం మంచిది.

*☘️మాఘ పూర్ణిమ వ్రత కథ..☘️*

పురాణం ప్రకారం ధనేశ్వర్ అనే బ్రాహ్మణుడు కాంతిక నగరంలో నివసించేవాడు. భిక్షాటన జీవితాన్ని గడిపాడు. బ్రాహ్మణుడు అతనికి పిల్లలు లేరు. ఒక రోజు అతని భార్య నగరంలో భిక్ష అడగడానికి వెళ్ళింది. కానీ అందరూ భిక్ష ఇవ్వడానికి నిరాకరించారు. ఆమెను పిల్లలు లేనిదానివని అవహేళన చేశారు. అప్పుడు ఎవరో ఆమెను కాళీక దేవిని  16 రోజులు పూజించమని చెప్పారు. దీంతో ఆ బ్రాహ్మణ దంపతులు ఆరాధనతో కాళీక దేవిని 16 రోజుల ఆరాదించడంతో కాళికా దేవి వారికి కనిపించింది. తల్లి కాళీక దేవి బ్రాహ్మణ భార్యకు  గర్భం పొందటానికి  వరం ఇచ్చింది. మీ బలం ప్రకారం ప్రతి పౌర్ణమికి మీరు ఒక దీపం వెలిగించాలని చెప్పింది. ఈ విధంగా ప్రతి పౌర్ణమి రోజు వరకు కనీసం 32 దీపాలను చేరుకునే వరకు దీపాన్ని పెట్టాలని చెప్పింది.

ఆరాధన కోసం బ్రాహ్మణుడు చెట్టు నుండి మామిడి పండ్ల , పండ్లను తెంపాడు. అతని భార్య పూజలు చేయండంతో ఆమె గర్భవతి అయింది. ప్రతి పౌర్ణమి నాడు తల్లి కాళికా దేవి చెప్పినట్లు ఆమె దీపం వెలిగించడం కొనసాగించింది. కాళికా దయవల్ల దేవదాస్ అనే కుమారుడికి అతని ఇంటికి ఒక కుమారుడు జన్మించాడు. దేవదాస్ పెద్దయ్యాక తన మామయ్యతో కలిసి చదువుకోవడానికి కాశీకి వెళ్లాడు. కాశీలో వారిద్దరికి ఒక ప్రమాదం జరిగింది. దీని కారణంగా దేవదాస్ మోసపూరితంగా వివాహం చేసుకున్నాడు. దేవదాస్ తాను చిన్నవాడని ఇంకా బలవంతంగా వివాహం చేసుకున్నానని చెప్పాడు. కొంత సమయం తరువాత కాళీ తన ప్రాణాలను తీయడానికి వచ్చెను  కానీ బ్రాహ్మణ దంపతులు పౌర్ణమిని వేగంగా ఉంచారు , కాబట్టి కాళికా దేవిని ఏమి చేయలేకపోయను. అప్పటి నుండి , పౌర్ణమి రోజున ఉపవాసం చేయడం ద్వారా , ఒకరికి బాధ నుండి ఉపశమనం లభిస్తుంది మరియు అన్ని కోరికలు నెరవేరుతాయి.
🙏🙏

Saturday, 8 February 2025

తిరుమల వివాహ కార్యక్రమానికి స్వామి వారి ఆశీర్వచనం

తిరుమల వివాహ కానుక :
(ఇది పూర్తిగా ఉచితం)🙏🚩

మీ ఇంట్లో వివాహం నిశ్చయం అయితే ఓ నెల ముందుగా మొదటి శుభలేఖ స్వామి వారికి రిజిస్టర్ పోస్ట్ పంపండి.. వెంటనే తిరుమల నుండి మీకు ఓ విశిష్టమైన కానుక అందుతుంది. దానిలో వధూవరులు చేతికి కట్టడానికి కంకణాలు, అక్షతలు (ఇవి పెళ్ళి నాడు తలంబ్రాలలో కలపండి)వివాహ వైశిష్ట్యం తెలిపే పుస్తకం,కుంకుమ,మహా ప్రసాదం,పద్మావతి శ్రీనివాసుల ఆశీర్వచనాలతో బహుమతి పంపడం జరుగుతుంది.

తిరుమల నుండి పెళ్ళి ఇంట ఆ స్వామి వారి బహుమతి అందినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేము..మీ ఇంట్లో జరిగే వివాహ ఆహ్వాన మొదటి పత్రిక ఈ అడ్రసు కి కొరియర్ చేయండి.శుభలేఖ మీద ఉన్న మన చిరునామాకి స్వామి వారి కానుక అందుతుంది.
To,
Sri Lord Venkateswara swamy,
The Executive Officer
TTD Administrative Building,K.T.Road
Tirupati, 517501

Monday, 3 February 2025

తారకాసురుడు పుత్రులు

తారకాసురుడి కొడుకులు :
తారకాసురుడి కొడుకులు విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు, అనే వాళ్ళు బ్రహ్మదేవుణ్ణి గురించి తపస్సు చేశారు. ఆయన ప్రత్యక్షమయ్యక, తమకు ఎన్నడూ చావు లేకుండా వరమిమ్మని కోరారు. 

అది అసాధ్యమన్నాడాయన. మరేదైనా వరం కోరుకొమ్మన్నాడు.

“అయితే సకల సౌకర్యాలూ కలిగి కామగమనం గల మూడు పట్టణాలు మా ముగ్గిరికీ ఇవ్వు. అవి దేవదానవాదులెవరూ ఛేదించరానివిగా ఉండాలి. అలా అయితే మేము సుఖంగా వుంటాం” అన్నారు వాళ్ళు.

“సరే! అలాగే ఇస్తాను. కాని ఆ మూడు పట్టణాలూ ఒక్కచోటికి రాకూడదు. తీరా వచ్చాకా బలవంతుడెవడైనా అది చూసి బాణం వేస్తే మాత్రం అవి నాశనమవుతాయి. అలా రాకుండా జాగ్రత్తపడండి!”అన్నాడు బ్రహ్మ దేవుడు.

"అలాగే" అని ఆ వరం పొందారు వాళ్ళు.

తరువాత మయుణ్ణి పిలిచి పురాలు నిర్మించవలసిందన్నారు. అతడు తన తపస్సంతా ధారపోసి, నాలుగుదిక్కులూ నూరేసి యోజనాలుండేట్టుగా ముగ్గురికీ మూడు పట్టణాలు నిర్మించాడు. ఒకటి బంగారుది, రెండవది వెండిది, మూడోది ఇనుముతో చేసినది. 

తారకాక్షుడికి బంగారు పట్టణం ఇచ్చాడు. అది స్వర్గంలో సంచరిస్తుంది. కమలాక్షుడికి వెండి పట్టణం ఇచ్చాడు. అది అంతరిక్షంలో తిరుగుతుంది. ఇనుపనగరును విద్యున్మాలికిచ్చాడు. అది భూమిమీద తిరుగాడుతుంది. అలా ఆ రాక్షసులు ముగ్గురూ సకల భోగాలు అనుభవిస్తూ అంతటితో తృప్తి పడక ముల్లోకాలనూ స్వాధీనపర్చుకున్నారు. 

మయుడు తన మాయాజాలంతో వాళ్ళకు కావలసినవన్నీ సమకూరుస్తుండేవాడు. ఇలా చాలా ఏళ్ళు గడిచిపోయాయి. తారకాక్షుడికి 'హరి' అనే కొడుకు పుట్టాడు. అతడు కూడా బ్రహ్మదేవుణ్ణి గురించి తపస్సు చేసి, 'త్రిపురాల్లో వున్న రక్కసులు ఒకవేళ ఆయుధాల వల్ల చనిపోతే వాళ్ళను నీళ్ళలో పడేసిన వెంటనే ఒక్కడు పదిమందై అమిత బలంతో లేచి రావాలి. అలాంటి బావులు ఆ మూడు పట్టణాల్లోనూ వుండేటట్టు వరమివ్వు. వాటిలో నీళ్ళు నిరంతరం వుండాలి' అని వరమడిగాడు. 

బ్రహ్మ సరేనని వరమిచ్చాడు.

అంతటితో వాళ్ళ ఆగడాలు పెచ్చుమీరాయి. ముల్లోకాలనూ వేధించడం మొదలు పెట్టారు. 

దేవేంద్రుడు తట్టుకోలేక బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు. బ్రహ్మ పరమేశ్వర సన్నిధికి చేరాడు. అంతా విని పరమేశ్వరుడు 
“ఆ రాక్షసులు చాలా బలవంతులు. నా ఒక్కడి చేత చెడరు. అందుచేత నా తేజోబలాల్లో సగం తీసుకుని మీరందరూ కలిసి వాళ్ళను సంహరించండి!” అన్నాడు.

“మహాత్మా! అది మా వల్ల కానిపని. నీ తేజస్సును మేము భరించలేం, అందుచేత మా అందరి తేజోబలాల్లో సగం సగం నీకే ఇస్తాం. నువ్వే ఆ శత్రువుల్ని సంహరించు” అని దేవతలు ప్రార్థించారు.

“సరే! అలాగే కానివ్వండి. నేను వాళ్ళను సంహరిస్తాను. కాని ఒక్క విషయం గుర్తుంచుకోండి. లోకాలన్నిటికీ పశుత్వం సహజం - నాకు పశుపతిత్వం కలగాలి. అలా అయితే పశువుల్ని చంపినా పాపం వుండదు. దివ్య రథం తయారుచేయండి. దానికి తగిన సారధినీ, విల్లమ్ములనూ తీసుకురండి" అన్నాడు శివుడు. 

తమకందరికీ పశుత్వం కలగడాన్ని గురించి దేవతలు విచారిస్తుంటే వాళ్ళ మనస్సు గ్రహించి "భయపడకండి! పాశుపతవ్రతం చేస్తే పశుత్వం పోతుంది" అని అభయమిచ్చాడు శివుడు. 

అప్పుడు దేవతలంతా తృప్తి పడి పరమేశ్వరుణ్ణి 'పశుపతి' అని స్తుతించారు. తమ తమ తేజోబలాలు సగం ధారపోసి ఆయనకు అభిషేకం చేశారు. విశ్వకర్మ దివ్య రథం తయారు చేశాడు.

“నా రథానికి సారథి ఎవరు?” అని అడిగాడు భవుడు.

“మీ ఇష్టం” అన్నారు దేవతలు.

“అలా కాదు. నాకంటే గొప్పవాణ్ణి సారథిగా మీరే నిర్ణయించండి” అని ముక్కంటి అనగానే దేవతలూ, మునులూ బ్రహ్మ దేవుడి వైపు తిరిగి సాష్టాంగ నమస్కారం చేశారు.

“శక్తి, చాతుర్యం కలిగిన సారథి రథికుణ్ణి తప్పకుండా గెలిపిస్తాడు. ఇంతగొప్ప రథానికి నీవంటి వాడు తప్ప మరొకడు సారథ్యం చెయ్యలేడు. ఇందుకు నువ్వు అంగీకరించాలి!” అన్నాడు శివుడు బ్రహ్మదేవుడితో.

చేతిలో వున్న కమండలం పక్కన పెట్టి, జడ ముడి బిగించి, ఓంకారాన్ని ములుకోలగా చేసుకుని రథమెక్కాడు బ్రహ్మ. శివుడు రుద్రుడై నారి సారించి, పాశుపతాస్త్రంతో సహా నారాయణాస్రాన్ని సంధించి ఆ మూడు పట్టణాల్నీ మనస్సులో నిలిపాడు. మరుక్షణం ఆ మూడూ ఒక్కచోటుకు చేరాయి. 

ఈశ్వరుడు బాణం విడవడం, ఆ మూడు పట్టణాలూ బూడిదై పశ్చిమ సముద్రంలో కలవడం కన్ను మూసి తెరిచేలోగా జరిగిపోయాయి. 

అప్పుడు సకల లోకాలూ సంతోషంతో మహాదేవుణ్ణి స్తుతించాయి.

మహాభారత యుద్ధంలో తనంతటి వాడు కర్ణుడికి సారథిగా వుండటమేమిటని శల్యుడు భీష్మించిన సందర్భంలో యీ కథ చెబుతూ కౌరవాగ్రజుడు, “మహాత్మా! విన్నావా! లోకహితం కోరి పరమేష్టి అంతటివాడు శివుడికి సారథ్యం చేశాడు. అలాగే ఇప్పుడు నాకోసం నువ్వు కర్ణుడికి సారథ్యం వహించు. నా గౌరవం కాపాడు. నన్ను రక్షించు. సారథి రథికుడి కంటే గొప్పవాడు కావాలనే నీతి నీ దయవల్ల నాకు సిద్ధింపచెయ్యి” అని శల్యుణ్ణి ప్రార్థించి ఒప్పించాడు.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                   

🍀🌺🍀

Thursday, 9 January 2025

10 జనవరి 2025 ముక్కోటి ఏకాదశి

10 జనవరి 2025 ముక్కోటి ఏకాదశి
---------------------------------------
ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తరద్వార దర్శనం చేస్తే కలిగే పుణ్య ఫలం ఏమిటి?
----------------------------------------
అనంతమైన పుణ్యఫలం అని చెప్పుకోవాలి. భారతీయులు కాంతిని ఆరాధించేటటువంటి వారు. ప్రాజ్ఞ్ముఖంగా ప్రయాణించేటటువంటి వారు. దేహంలో ఎప్పుడూ కూడా ఎడమ భాగాన్ని కుడి భాగం నియంత్రిస్తూ ఉంటుంది. వామ భాగం స్త్రీ సంబంధితమైనటువంటి భాగం. ప్రేమ, పారమార్థిక దృష్టి, లౌకిక సుఖములు, ఆనందములు ఇవన్నీ కూడా ఉత్తర దిక్భాగంలో ఉంటాయి. వీటన్నింటినీ నియంత్రించేది ఎడమ భాగం. అలాగే మన దృష్టి కూడా నిరంతరం ఎడమ వైపుకే ప్రసరిస్తూ ఉంటుంది. ఉత్తరం దిక్కుకు ధనము, సంపద వంటి వాటికి ప్రాముఖ్యత ఉంది. అన్నింటికంటే మించి ఈ విశాల విశ్వమంతా కూడా తన చుట్టూ తానూ తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అనుకుంటే ఈ విశ్వంలో ఉండే అంతర్భాగము axil అంటారు దానిని అది దీనికి వ్యతిరేకంగా తిరుగుతూ ఉంటుంది. ఈ విశ్వము దక్షిణం వైపునుంచి ఉత్తరం వైపుకు anti clockwise తిరుగుతూండగా అందులోని అంతర్భాగం ఉత్తరం వైపునుంచి దక్షిణానికి clockwise తిరుగుతుంది. "ప్రాగ్ ఆరభ్య దక్షిణేణ వర్తనం" మన హిందూ ధర్మంలో అందుకోసమే ఆలయానికి వెళ్తే ప్రదక్షిణ చేయాలి - ప్రాగ్ ఆరభ్య దక్షిణేన వర్తనం. ఉత్తరంగా, ఈశాన్యంగా, తూర్పుగా, ఆగ్నేయం, దక్షిణం ఇలా ప్రదక్షిణ చేస్తూ ఉంటాం. కనుక ఈ రెండింటి మధ్య ఉండే వైరుధ్యం వల్ల కలిగిన ఆకర్షణ శక్తి చేత మనం ఈ భూమిమీద అంటిపెట్టుకొని ఉన్నాం దానికే భూమ్యాకర్షణ శక్తి అని పేరు.
----------------------------------------
ఈరోజున ఉత్తర దిగ్భాగ మార్గాన్ని అనుసరించి ఇంక రెండు మూడు రోజులలో సూర్యనారాయణ మూర్తి ఉత్తర దిగ్భాగంలో ప్రయాణం చేస్తూంటాడు. ఈరోజున మనం ఉత్తర దిగ్భాగంతో ప్రయాణం ప్రారంభం చేసినట్లయితే తప్పకుండా కైవల్యం లభిస్తుంది. ఈ భూమితో ఉండే ఆకర్షణ సంబంధిత సంబంధాలన్నీ కూడా తొలగిపోయి ఆ శ్రీమన్నారాయణ మూర్తిని చేరుకుంటాము. భవ బంధనాలన్నీ కూడా తొలగిపోతాయి. అనేటటువంటి రహస్యాన్ని కనుగొన్న ప్రాచీనులు ఈ అంశాలన్నీ కూడా శాస్త్రోక్తంగా చెప్తే అందరికీ అర్థం అవుతాయో లేదో అనే ఉద్దేశ్యంతో కథలను జోడించి విభీషణ శరణాగతి కథ, వైకుంఠ ఏకాదశి కథ, ముప్పది మూడు కోట్ల దేవతలతో ఆ స్వామి ఈనాడు మనకు దర్శనమిస్తాడు. మూడు కోట్లతో రంగధాముని దర్శనమిస్తాడు. ఇలా చెప్పి ఆలయాలవైపు మనల్ని మరల్చారు. స్వామి దర్శనం చేసుకోండి అంటూ అనుజ్ఞనిచ్చారు. మన ప్రయత్నం కాకుండా గురువుతో ప్రయత్నం కావాలి. స్వప్రయత్నం కూడదు అంటుంది ధర్మము. కాబట్టి నారాయణుడే అటువంటి మనలో జ్ఞానమును ప్రేరేపించు వాడు. ఆయన ప్రపన్నుడు. అడిగిన వాళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇచ్చే ప్రపన్నుడు. ఎవరిని రక్షించాలా? అని సంసిద్దుడై ఉంటాడుట. కాబట్టి ఉత్తర ద్వార దిశగా మనం ప్రయాణం చేస్తే తప్పకుండా కోరిన కోరికలు నేరవేరుతాయి. అన్నింటికంటే కోరవలసినది ఏమున్నది? - ఈ లోకంతో భవ బంధనాలనుంచి విముక్తి. మోక్షము అంటే "ముచిల్ మోక్షణే" అని అర్థం. బంధనాలనుంచి ముక్తిని పొందడము, విముక్తిని కలిగించుకోవడము అని అర్థం. అందుకే ఉత్తర దిశ ఇంత ప్రాముఖ్యం కలది, ఇంతగా విశేషత ఈ పండుగకు ఉన్నది. **************************--------------------------------------- మన సంప్రదాయంలో వైకుంఠ ఏకాదశికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. దీనినే ముక్కోటి ఏకాదశి అని అంటారు. మూడు + కోటి = ముక్కోటి
ఈ రోజున వైష్ణవ ఆలయాలలో ఎదురుగా ఉన్న ద్వారాన్ని మూసేసి, ఉత్తర ద్వారాన్ని తెరిచి , ఆ ద్వారం నుండి స్వామి దర్శనాన్ని చేయిస్తారు. ఈ ఉత్తర ద్వారాన్నే వైకుంఠ ద్వారమని అంటారు.
----------------------------------------
ఇలా ఉత్తర ద్వార దర్శనం చేయడం వెనుక స్వామివారి లీలావిశేషాలు ఉన్నాయి.
----------------------------------------
శ్రీ మహావిష్ణువు కృతయుగంలో మత్స్య,కూర్మ,వరాహ, నారసింహావతారాలను, త్రేతాయుగంలో రామచంద్ర అవతారాన్ని ధరించి ,ద్వాపరయుగంలో కృష్ణ అవతారంలో దర్శనమిచ్చిన స్వామి, కలియుగంలో విరజానదీ మధ్యభాగంలో, సప్తప్రాకార సంశోభితమైన పరమపదంతో సహా శ్రీ దేవి భూ దేవిల సమేతుడై, విష్వక్సేనాదులు తనను కొలుస్తూ ఉండగా, శేషపాన్పుపై అర్చావతారుడై వెలసిన దివ్యగాధను, ముక్కోటి విశదపరుస్తూ ఉంటుంది. ఇందు వెనుక ఆసక్తికరమైన కధ ఉంది.
----------------------------------------
పూర్వం ఒకానొక సమయంలో ఇంద్రుడు, తన గొప్పదనాన్ని అందరితోపాటు త్రిమూర్తులకు, అష్టదిక్పాల్కులకు తెలియచేయాలన్న ఉద్దేశ్యంతో ఒక గొప్ప విందును ఏర్పాటు చేశాడు. ఆ విందుకు శ్రీ మహా విష్ణువు శ్రీ భూనీలా సమేతముగా, పరమశివుడు పార్వతీగంగా సమేతముగా, బ్రహ్మదేవుడు శ్రీ వాణీ సమేతముగా విచ్చేశారు. ఇక దిక్పాలకులు ,ముక్కోటి దేవతలు, సకలలోక వాసులు సకుటుంబ సపరివార సమేతముగా విచ్చేసారు. వారి ఆగమనముతో స్వర్గలోకమంతా కోలాహలంగా ఉంది. అప్పుడు పార్వతిదేవి ఇంద్రునితో ," నీ సభలో అత్యంత ప్రతిభాశాలురైన నాట్యమణులున్నారని ఏర్పాటు చేస్తే, అది చూసి మేమంతా ఆనందిస్తాము కదా" అని అడుగగా ఇంద్రుడు తక్షణమే ఊర్వశి,మేనక,తిలోత్తమలను పిలిపించి నాట్య ప్రదర్శనలను ఇప్పించాడు. వారి నృత్యంతో అంతగా సంతృప్తి చెందని పార్వతీదేవిని చూసి ఇంద్రుడు వినయంతో ఒక్కసారి రంభ నృత్యం చూసి వారి అభిప్రాయాన్ని తెలియచేయమని కోరాడు.
----------------------------------------
అనంతరం సభావేదిక చేరుకున్న రంభ ముందుగా పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి, అనంతరం లక్ష్మీ నారాయణుల పాద పద్మములకు, వాణిపద్మజులను సేవించి, సభికులకు అభివందనం చేసి, సరస్వతీ భరతభూషణులను స్తుతించి నాట్యం మొదలు పెట్టింది. ఆమె నాట్యానికి సభికులంతా ముగ్ధులు అయ్యారు. రంభ నాట్యకౌసల్యాన్ని చూసి మెచ్చిన పార్వతీ దేవి నవరత్నఖచిత బంగారు గండపెండేరాన్ని,లక్ష్మీ దేవి బంగారు కడియాన్ని,సరస్వతి దేవి రత్న ఖచిత దండ కడియాన్ని, రంభకు బహూకరించారు. ఇంకా చాలా మంది దేవతలు రంభకు బహుమతులు ఇచ్చారు.
రంభ తన గౌరవాన్ని నిలబెట్టిందని తలచిన ఇంద్రుడు, ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకు రంభ ఇంద్రుని వలన తనకు పుత్రుడు కలిగేటట్లు అనుగ్రహించమని కోరింది. అది విన్న సభాసదులందరూ కరతాళధ్వనులతో తమ ఆమోదాన్ని తెలిపారు. ఆమె కోరిక తీరేందుకు ఇంద్రుడు సకల దేవతల సాక్షిగా రంభ సహితంగా నందన వనానికి వెళ్ళాడు.
----------------------------------------
ఈ వ్యవహారమంతా దేవగురు బృహస్పతికి నచ్చలేదు. ఆవేశాన్ని అణుచుకోలేకపోయిన దేవగురువు ,నేరుగా నందన వనానికి వెళ్ళి,సరస సల్లాపాలలో మునిగి ఉన్న ఇంద్రుని పైకి తన కమండలాన్ని విసిరిగొట్టాడు. అప్పటికీ అతని ఆవేశం చల్లారకపోవడంతో దేవేంద్రుని రత్నకిరీటం కిందకు పడేంతగా కొట్టాడు. ఇంద్రుడిని భూలోకంలో ఆటవిక బందిపోటుగా జన్మించమని శపించాడు. తన వలన ఇంద్రుని శపించవలదని రంభ కోరినప్పటికి బృహస్పతి వినకపోవడంతో, రోషావేశపూరితమైన రంభ దేవ గురువుని నీచ జన్మ ఎత్తమని శపిస్తుంది.
----------------------------------------
ఈ లోపు అటుగా వచ్చిన నారదుడు విషయాన్ని గ్రహించి, ముగ్గురుని త్రిమూర్తుల వద్దకు తీసుకొని వెళ్ళాడు. ఈ శాపాలు అందరు అనుభవించవలసిందే అని తెలిశాక, ఇంద్రుడు భోరున విలపించసాగాడు. దీనముగా వేడుకున్నాడు.
----------------------------------------
ఇంద్రుని దుఃఖాన్ని చుసిన కరుణాపూరితుడైన విష్ణుభగవానుడు అతనిని ఓదార్చి, తను భూలోకంలో అవతరించి శాపవిమోచనాన్ని ప్రసాదించగలనని చెప్పాడు. విష్ణువు మాటలు విన్న లక్ష్మీ దేవి " స్వామి గురువుశిష్యులు ఇద్దరు పరస్పర వివేకశూన్యులై శపించుకుంటే , ఆ శాపవిమోచనానికి మీరు భూలోకంలో అవతరించడం దేనికి...రామ అవతారంలో పడిన కష్టాలు చాలవా? " అని అడిగింది."
---------------------------------------
తాను ద్వాపరయుగాంతంలో దుర్వాసుని శాపంవల్ల బాధితురాలైన ఓ గొల్ల భామకు వరం ఇవ్వడమే కారణమని పేర్కొన్నాడు.
----------------------------------------
అలా శ్రీ మహవిష్ణువు భూలోక అవతార వెనుక చాల కథలు ఉన్నాయి...అందులో ఇది ఒకటి!

వైకుంఠ ఏకాదశి......
శ్రీరంగనాథునిగా అవతరించిన శ్రీహరిని గోదాదేవి ధనుర్మాసంలో భక్తితో పూజించి తన భర్తగా పొందింది. రోజుకో పాసురంతో శ్రీమన్నారాయణుని స్తుతించిన గోదాదేవి ఆయనను ప్రసన్నంగా చేసుకుంది. ఇక, పుష్యమాసంలో వచ్చే శుక్షపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, పుత్రదా ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున ఉత్తర ద్వారంలో శ్రీమన్నారాయణుని దర్శించుకోవాలని భక్తులు ఎంతో ఆరాటపడతారు. ఏడాదికి వచ్చే ఇరవైనాలుగు ఏకాదశుల్లో ప్రతిదీ పవిత్రమైందే. కానీ, వీటిలో వైకుంఠ ఏకాదశి మాత్రం లేదు. ఎందుకంటే మిగతా ఏకాదశులు చంద్రమానం ప్రకారం గణిస్తే వాటికి భిన్నంగా సౌరమానం ప్రకారం దీన్ని గణిస్తారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు.
ముక్కోటి ఏకాదశి పేరు వెనుక పురాణ కథనాలు
----------------------------------------
వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశని, స్వర్గద్వార ఏకాదశి అని పిలుస్తారు. ఈ పేర్లు వెనుక వేర్వేరు కథలు పురాణాల్లో కనిపిస్తాయి. శ్రీమహావిష్ణువునకు నెలవైన వైకుంఠంలోని వాకిళ్లు ఈరోజునే తెరుచుకుంటాయి కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారు. దక్షిణాయనం ప్రారంభం ఆషాడ శుద్ధ ఏకాదశి నాడు పాల కడలిలో యోగనిద్రకు ఉపక్రమించిన నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారు. ఇలా మేల్కొన్న స్వామిని దర్శించుకోవడానికి పుష్యమాస శుక్లపక్ష ఏకాదశి నాడు ముక్కోటి దేవతలూ వైకుంఠానికి చేరుకుంటారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. దక్షిణాయణంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈ రోజునే స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు కాబట్టి స్వర్గద్వార ఏకాదశి అని అంటారు.
----------------------------------------
కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను, రుషులను, ప్రజానీకాన్ని పట్టిపీడిస్తూ క్రూరంగా హింసించేవాడు. ముర అకృత్యాలను భరించలేని దేవతలు శ్రీహరికి తమ గోడు చెప్పుకున్నారు. దీంతో, మురాసురుని సంహరించడానికి శ్రీమహావిష్ణువు బయల్దేరతాడు. తనను సంహరించడానికి శ్రీహరి వస్తున్న విషయం తెలిసిన మురాసురుడు సాగర గర్భంలోకి వెళ్లి దాక్కుంటాడు. అతడిని బయటికి రప్పించేందుకు ఉపాయం పన్నిన నారాయణుడు ఓ గుహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటిస్తాడు. శ్రీహరిపై దాడికి ఇదే అదనుగా భావించిన మురాసురుడు గుహలోకి ప్రవేశించి స్వామిని వధించేందుకు కత్తి దూయగానే ఒక శక్తి ఉద్భవించి మురను సంహరిస్తుంది. ఈ విధంగా దేవతలను సంరక్షించిన ఆ శక్తికే ఏకాదశి అని నామకరణం చేశారు. 

Friday, 3 January 2025

మహా కుంభమేళ జరిగే ప్రదేశం 🙏🙏🙏🙏🙏

మహాకుంభమేళా" సంక్రాంతి నుండి శివరాత్రి వరకు- 13 జనవరి నుండి 26 ఫిబ్రవరి 2025 వరకు పవిత్ర గంగా యమునా సరస్వతి నదుల త్రివేణి సంగమం ప్రయాగ్‌రాజ్, ఉత్తరప్రదేశ్ లో జరుగబోతున్నది.||*

వివరాలు:
  12 సంవత్సరాలకు ఒకసారి జరిగే పవిత్ర స్నానాల సమయాన్ని 'కుంభమేళా' అని ఆరు సంవత్సరాలకు ఒకసారి జరిగే దాన్ని 'అర్థ కుంభమేళా' అని, ప్రతి సంవత్సరం మాఘమాసంలో జరిగే పవిత్ర స్నానాలను 'మాఘీమేళా' అనే పేరుతో పిలుస్తారు. బాండము ను 'కుంభము' అని 'కలశం' అని అంటారని మనకు తెలుసు. ఖగోళంలో జరిగే మార్పులను అనుసరించి పంచాంగం ప్రకారం లెక్కించిన విధంగా ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క సమయంలో కుంభమేళా జరుగుతుంది. 

కుంభమేళా జరిగే పవిత్ర స్థలాలు:
    1.ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ వద్ద గంగానదిలో,
2.మధ్యప్రదేశ్‌ ఉజ్జయిని వద్ద క్షిప్రానదిలో,
3.మహారాష్ట్రలోని నాసిక్‌ వద్ద గోదావరి నదిలో 
4.ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌ లో గంగా, యమునా మరియు అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతి నది సంగమం వద్ద.

   ప్రస్తుతం విష్ణు పాదోద్భవి గంగ ఆకాశమార్గం గుండా వచ్చి హిమాలయాల పైన చేరి అక్కడి నుండి శివుడి జటాజూటంలో పడి హరిద్వార్ వద్ద దివి నుండి భువికి దిగివచ్చి భూలోకంలో ప్రవహిస్తూ ప్రయాగరాజ్ వద్ద గంగా యమునా అంతర్వాహిని సర్వసతి నదిని కలుపుకొని త్రివేణి సంగమంగా విరాజిల్లుతున్న స్థలంలో కుంభమేళా జరుగబోతున్నది. మొట్టమొదటిసారిగా ఈ క్షేత్రంలోనే యాజ్ఞవల్క్య మహర్షి ఇక్కడ యజ్ఞం చేశారని పురాణాలు తెలియజేస్తున్నాయి.

చరిత్ర:
          మన పురాణాల ప్రకారం విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు దాసిగా ఉన్న తల్లి వినితను మరియు తనను, పినతల్లి కద్రువ బానిసత్వం నుండి విముక్తి కోసం కద్రువ కుమారులైన నాగుపాముల కోరిక మేరకు దేవలోకం వెళ్లి ఇంద్రలోక రక్షకులందరినీ ఓడించి అమృత కలశాన్ని తీసుకొని వస్తుండగా ఇంద్రుడు ఎదురుగా వచ్చి కారణం తెలుసుకుని విషాన్ని చిమ్మె పాములకు మృత్యువే లేకుండా అమృతం ఇవ్వడం భావ్యం కాదని హితవు పలికి గరుత్మంతుని శక్తిని మెచ్చుకుంటూనే నీవు అమృత బాండాన్ని నాగులకప్పగించి, వారి ఎదురుగా దర్బలపై ఉంచి నీవు నీ తల్లి విముక్తులు కాగలరు. వెనువెంటనే ఆ అమృతాన్ని వారికి దక్కకుండా దేవలోకం తీసుకొని వెళ్తానని చెప్పి అలాగే చేశాడు ఈ క్రమంలోనే కలశం నుండి అమృతం భూలోకమున నాలుగు నదులలో నాలుగు చోట్ల కొన్ని చుక్కలు పడినట్లు చరిత్ర, ఆ అమృతపు బిందువులు పడిన ప్రదేశములను పుణ్యస్థలాలుగా తీర్థాలుగా భావించి ప్రజలు పుణ్యస్నానాలు చేసే పరంపర ప్రారంభమైంది.

కుంభమేళాలో:
   కుంభమేళా అంటే కేవలం కుటుంబమంతా వెళ్లి పుణ్యస్నానాలు చేయడం మాత్రమే కాదు, పండితులు నిర్ణయించిన క్షణం నుండి అనేకానేక వేడుకలు. కుంభమేళా ఖగోళ శాస్త్రం, జ్యోతిషశాస్త్రం, ఆర్థిక శాస్త్రం సామాజిక శాస్త్రం, ఆధ్యాత్మికత, సంప్రదాయాలు, సాంస్కృతిక ఆచారాలు మరియు విజ్ఞాన శాస్త్రాలన్ని పండితులచేత, ఋషుల చేత మునుల చేత సన్యాసుల చేత నెలల తరబడిగా ఆ ప్రాంతంలోనే డేరాలు వేసుకుని ఉండి కఠిన సాధన చేస్తూ గడచిన 12 సంవత్సరాలలో వారు కనుగొన్న కొత్త క్రొత్త విషయాలను దేశం నలుమూలల నుండి ప్రజలకు ప్రబోధించే సన్నివేశం అది. సమాజానికి పాటించవలసిన మంచిని బోధించి మార్గదర్శనాన్ని చూపించే సమయం అది.

ధర్మరక్షణ కోసం:
    కుంభమేళా సమయంలో అనేక ఏనుగులు, గుర్రాలు మరియు రథాలపై ' వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న సాంప్రదాయిక ఊరేగింపు సమయంలో నాగ సాధువులు మండలేశ్వరులు మహామండలేశ్వరులు మరియు అఖాడాలు (వ్యాయామాలు చేసి శక్తివంతులుగా తయారై, తమకు తాము సమాజం కోసం సమర్పించుకున్న దళాలు) కత్తులు, త్రిశూలాలు గదలు ధరించి సనాతన ధర్మాన్ని రక్షించడానికి మేము ముందుంటామని నడుస్తుండగా వెనుక శిష్యులు సామాన్య భక్తులు లక్షలాదిగా పాల్గొంటారు అనంతరం 'షాహిస్నాన్' పుణ్యస్నానాలు ఆచరిస్తారు. కుంభమేళాకు హాజరయ్యేందుకు సంక్రాంతి నుండి శివరాత్రి వరకు కోట్ల మంది భక్తులు వస్తారు. వీరంతా ధర్మరక్షణకు మేమూ నిలబడతామనీ, 'ధర్మరక్షణ అంటే వ్యక్తిగతంగా ధర్మాన్ని పాటించడమే అని భావించి సంకల్పం తీసుకొని పుణ్యస్నానాలాచరించి తిరిగి వస్తుంటారు'. పూజ్యులు పీఠాధిపతులు మఠాధిపతులు భక్తులకు మంత్రోపదేశము చేస్తుంటారు, ప్రవచనాలు చేస్తుంటారు, కుంభమేళాలో వేలాదిమంది సాధ్విమణులు (మహిళా సన్యాసులు) కూడా ఆశ్రమాలు ఏర్పాటు చేసుకొని ప్రబోధాలు చేస్తుంటారు.

సామాజిక సమరసత వెల్లివిరిసే చోటు:
         పుణ్య స్నానాలు ఆచరించడం కోసం దేశం నలుమూలల నుండి ప్రపంచంలోని అనేక దేశాల నుండి కోట్ల మంది ప్రజలు కలిసి వచ్చి ప్రాంతాల బేధాలు మరిచిపోయి, కులాలు మరిచిపోయి, ఆరాధనా పద్ధతులు ఏవైనా తరతమ బేధాలు పాటించకుండా కుంభమేళా సమయంలో కలసి స్నానాలు చేస్తారు ఇంతటి సమాన భావనతోనే.. వచ్చిన భక్తులందరికీ గుడారాలు వేసి ఆవాసం ఏర్పాటు చేయడం, మంచినీళ్లు పానీయాలు, అల్పాహారాలు,భోజనాలు అందించడం, రాత్రి వేళల్లో వివిధ ప్రాంతాలకు చెందిన తమతమ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించడం, వారు చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు అందరికీ పరిచయం చేస్తుఉంటారు.

సంత్ సమ్మేళనాలు - విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో పునఃప్రారంభం:
                      ప్రతి 12 సం.లో ప్రకృతిలో వచ్చే మార్పులు, కాలానుగుణంగా చేయవలసిన పనులు సమాజంలోని ప్రజల అవసరాలు మరియు నియమాల విషయంలో అనుభవం కలిగిన సాధువులు సన్యాసులు కలిసి సమ్మేళనాలు నిర్వహించి తీర్మానాలు చేసి దేశ ప్రజలందరికీ తద్వారా ప్రపంచ ప్రజలందరికీ మార్గదర్శనం చేస్తుంటారు. ఇలా లక్షల సంవత్సరాల నుంచి కొనసాగుతున్నట్లుగా చరిత్ర. కానీ దురదృష్టవశాత్తు రాజా శ్రీహర్షుని పాలనా కాలం 644 వ సం.లో జరిగిన సంత్ సమ్మేళనం తర్వాత విదేశీ దండయాత్రల కారణంగా సాధారణ పుణ్యస్నానాలు చేయడం జరిగినప్పటికీ, కుంభమేళ సందర్భంగా స్వామీజీల సమావేశాలు, తీర్మానాలు ప్రబోధాలు ఆగిపోయాయి మళ్లీ 1966వ సంవత్సరం నుండి పునః ప్రారంభం అయినాయి, 
1964 సంవత్సరంలో ప్రారంభించబడిన విశ్వహిందూ పరిషత్ 1966వ సం. లో జరిగిన కుంభమేళాలో ప్రపంచవ్యాప్తమైన హిందువులతో 'విశ్వసమ్మేళనం' నిర్వహించింది. ఆ సమయంలో హిందూధర్మంలోని వివిధ ధార్మిక ఆధ్యాత్మిక మార్గాలకు చెందిన ధర్మగురువులైన నలుగురు శంకరాచార్యులు, వైష్ణవాచార్యులు, నింబార్కాచార్యులు, బౌద్ధ జైన సిక్, గాణాపత్య, శాక్తేయ మరియు అనేకనేక వైవిధ్యం కలిగిన ఆరాధనా పద్ధతులు అనుసరించే వర్గాలకు నేతృత్వం వహించే పెద్దలందరూ పాల్గొన్నారు. ఈ ప్రయత్నం వందల సంవత్సరాల తర్వాత పూజ్యులు మాధవరావు సదాశివరావు గోల్వాల్కర్ గారి నాయకత్వంలో విశ్వహిందూ పరిషత్ చేసిన ప్రయత్నం కారణంగా సాధ్యపడింది. 

   2024 లో జరిగే కుంభమేళాలో కూడా జనవరి 24,25వ తేదీలలో మార్గదర్శక మండలి సమ్మేళనం, 26 తేదీన దేశం నలుమూలల నుండి 128 వివిధ ఆరాధన మార్గాలకు చెందిన 'సంత్ సమ్మేళనం', 27వ తేదీన 'యువ సంత్' (యువ సన్యాసుల) సమ్మేళనం జరగబోతున్నది

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సామూహం: 
          చంద్రమండలం పైన నిలబడి భూమి వైపు చూస్తే కనబడే ఏకైక ప్రజా సమూహం కుంభమేళా, ప్రపంచంలోనే అతి పెద్దదైన మానవ సమూహం కలిసే సన్నివేశం కుంభమేళ, ప్రపంచంలోని 13వ వంతు ప్రజలు పాల్గొనే సన్నివేశం కుంభమేళ, సగం దేశాల జనాభా కంటే ఎక్కువ. 2017 వ సంవత్సరం అర్థ కుంభమేళాలో మూడు కోట్ల మంది పాల్గొన్నట్లుగా 2001 వ సంవత్సరం కుంభమేళాలో ఆరు కోట్ల మంది పాల్గొన్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి ఈ సంవత్సరం కనీసం 40 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని ఏర్పాట్లు చేస్తున్నారు.

  ప్రాచీన కాలంలో ఆదిశంకరాచార్యుల వారు ప్రయాగరాజ్ సందర్శించి కుంభమేళాలో పాల్గొనగా, 1514 సం.లో బెంగాల్ కు చెందిన చైతన్య మహాప్రభు సందర్శించినట్లుగా, మరియు తులసీ రామాయణాన్ని వ్రాసిన సంత్ తులసీదాస్ కూడా కుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానం ఆచరించినట్లుగా చరిత్ర.

కుంభమేళా పవిత్ర స్నానానికి ఆంక్షలు.?? :
     భారతదేశంలోని పాలకుల మధ్యన జరిగిన యుద్దాలలో ఎవరు గెలిచినప్పటికీ ఇక్కడి సాంస్కృతికపరమైన ఉత్సవాలను కార్యక్రమాలను గెలిచిన రాజు కూడా నిర్వహిస్తూ ఉండేవాడు కానీ దురదృష్టం విదేశీ ఆక్రమణకారులు తమ కుట్రలతో కుతంత్రాలతో స్థానిక పాలకులను జయించి ఇక్కడి ఆలయాలను కూల్చివేశారు కుంభమేళాలు నిర్వహించకుండా ఆంక్షలు విధించారు, కొన్ని సంవత్సరాలు ఆగిపోయాయి కూడా, కానీ.. స్థానిక ప్రజలకు తమ ధర్మంపట్ల ఉన్న ప్రగాఢమైన విశ్వాసాన్ని కాదని అణిచివేస్తున్న విదేశీ పాలకులపై తిరుగుబాటు చేయడాన్ని గమనించి మధ్యేమార్గంగా పన్ను చెల్లించి పూజలు చేసుకోండని ప్రకటించారు, 'జిజియా పన్ను' వసూలు చేశారు, ఇలా బొట్టు పెట్టుకోవడానికి పూజ చేసుకోవడానికి, జుట్టు పెంచుకోవడానికి మరియు 'కుంభమేళాలో స్నానం చేయడానికి పన్ను చెల్లించి ధార్మిక కార్యక్రమాలు జరుపుకొని తమ ధర్మాన్ని కాపాడుకున్నారు ఆనాటి ప్రజలు'. 

ఆంగ్లేయుల కాలంలో:
   1806లో ఆంగ్లేయులు కుంభమేళా యాత్రికుల నుండి స్నానం చేయాలనుకునే వారికి 1 రూపాయి పన్ను విధించిందనీ 'వెల్ష్ ట్రావెల్ పుస్తకం రైటర్ ఫానీ పార్క్స్' వ్రాశాడు, ఆ రోజుల్లో "మనిషికి ఒక నెల రోజుల పాటు సుఖంగా జీవించడానికి 1 రూపాయి సరిపోతుంది" అటువంటి ఒక రూపాయి చెల్లించి స్నానం ఆచరించేవారు అని చెప్పాడు. 
    అతనికి సమకాలీనుడైన ఆంగ్లయుడు మరొక పుస్తకంలో, కంపెనీ మూడు రూపాయలు పన్ను విధించిందని స్థానికులైన హిందువులు వాటిని చెల్లించి కుంభమేళాలో స్నానం చేశారని, నది ఒడ్డున కూర్చున్న వేద పండితులకు, పేదబ్రాహ్మణులకు దానధర్మాలు మరియు బహుమతులు సమర్పించుకునే వారని కూడా వ్రాసాడు.

ప్రయాగరాజ్ వటవృక్షం:
       స్థానిక ప్రజలను విదేశీ ఆక్రమణకారులు తమ మతంలోకి మార్చి లేదా గోమాంసం తినిపించి ధర్మ బ్రష్టులను చేస్తే వారందరూ బాధతో 12 సం.లకు ఒకసారి కుంభమేళా జరిగే ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించి ఆ పక్కనే 'కల్పాంతము నాటి నుండి భూమిపై ఉన్న 'వటవృక్షం' క్రింద కూర్చుని పూజలు జరిపి తమ పూర్వీకులను గుర్తు చేసుకుని తిరిగి సనాతన ధర్మాన్ని తిరిగి పాటించేవారు'. 
    స్థానికులను ప్రలోభాలకు గురిచేసి, భయపెట్టి తమ మతంలోకి మార్చుకున్న విదేశీ ఆక్రమణకారుడు బాబర్ వారందరూ తిరిగి తమ మాతృ ధర్మంలోకి వెళ్తున్నారని గమనించి కుంభమేళా స్నానం, గంగానది స్నానంపై ఆంక్షలు విధించాడు, వటవృక్షం కింద పూజలు చేయకూడదని ఫత్వా జారీ చేశాడు, వటవృక్షాన్ని కూల్చివేశాడు కొంతకాలానికి వటవృక్షం చిగురించింది. ఆ తదుపరి మరొకసారి అక్బర్ వటవృక్షాన్ని కూల్చివేశాడు కొన్నాళ్లకే మళ్లీ చిగురించింది, ప్రజలు యధావిధిగా ఆ చెట్టు కింద పూజలు చేస్తూ స్వధర్మంలోకి వస్తున్నారు ఇది గమనించిన ఔరంగాజేబ్ ఒకవైపు జిజియా పన్ను ( హిందువుగా బ్రతకడానికి పన్ను) విధించడం మరోవైపు వటవృక్షాన్ని విధ్వంసం చేయించి సీసం (లెడ్) పోయించాడట అయినప్పటికీ కొంత కాలానికి మళ్లీ చిగురించింది 'హిందూ ధర్మం వలే అనేక ఆటుపోట్లు అనుభవించి మళ్లీ జీవం పోసుకుంది'. ఇప్పటికీ ప్రజలు ఆ మర్రిచెట్టును దర్శించుకుని తమ పూర్వీకులను గుర్తుచేసుకొని పూజించుకుని వస్తారు.

స్వాతంత్ర్య పోరాటానికి ఊపిరిలూదిన కుంభమేళ: 
                    దేశవ్యాప్తంగా కుంభమేళాలలో కలిసే ప్రజలు ధార్మిక ఆధ్యాత్మిక సంకల్పాలతో పాటు స్వాతంత్ర్యం సాధిస్తామని ప్రతిజ్ఞను కూడా చేసి తిరిగి వెళ్లేవారు. అంతేకాదు తల్లిని బానిసత్వం నుండి విడిపించిన గరుత్మంతుడిని గుర్తుచేసుకొని భారతమాతను బందీ నుండి విడిపిస్తామని సంకల్పాన్ని తీసుకొని వెళుతుండేవారు. దేశవ్యాప్తంగా తిరుగుబాటు ఆందోళనలు జరగడానికి మరియు స్వాతంత్ర్య పోరాటానికి నాయకత్వం వహించే నాయకులను గుర్తించి వారి నాయకత్వాన్ని స్వీకరించడానికి వారి మార్గదర్శనాన్ని పొందడానికి దేశ ప్రజలకు ఈ కుంభమేళాలు వేదికలుగా ఉపయోగపడేవి. 

విశ్వహిందూ పరిషత్ 1966 సమ్మేళనం: 
      1964 సంవత్సరం ప్రారంభమైన పరిషత్ 1966వ సంవత్సరంలో విశ్వసమ్మేళనం జరుపగా 12 దేశాల నుండి 25 వేల మంది భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమ్మేళనానికి మార్గదర్శనం చేసిన స్వామీజీలు మతం మారిన హిందువులందరినీ తమ పూర్వ ధర్మంలోకి రావాల్సిందిగా ఆహ్వానించడంతో ఇప్పటికీ 15 లక్షల తిరిగి తమ మాతృధర్మం లోకి వచ్చినట్లుగా సమాచారం. అప్పటివరకు విదేశాలకు మరియు సముద్ర ప్రయాణాలకు అనుమతి లేని సమయం. ఈ సమావేశంలో పాల్గొన్న పీఠాధిపతులు విదేశాలకు ధర్మప్రచారం కోసం, మరియు ఆయా దేశాల్లో ఉన్న హిందువులకు వారి ఆలయాలలో అర్చకులుగా పురోహితులుగా ఉండి షోడశ సంస్కారాలు జరిగేటట్లుగా మార్గదర్శనం చేయడానికి కూడా వెళ్లాలని నిర్ణయం ప్రకటించారు. ఆ తదుపరి విదేశాలకు సంస్కారాలను అందించడానికి మరియు ధర్మ ప్రచారానికి వెళ్లే వారి సంఖ్య పెరిగింది. గోవు సకల దేవతలకు నిలయమని గోవును రక్షించుకోవాలని ప్రకటించారు. గోరక్ష ఆందోళన చేపట్టి ప్రతి సంవత్సరం లక్షకు పైగా ఆవులను కాపాడుకుంటున్నాం. అడవులలో మరియు మురికి వాడలలో ఉన్న పేదలకు సహకరించాలని వారికి సేవ చేయాలని ఆదేశించారు. అప్పటినుండి వేలాదిగా సేవా కార్యక్రమాలనూ విశ్వహిందూ పరిషత్ ప్రారంభించింది.

  ఈ సంవత్సరం ప్రయాగరాజ్ 'మహా కుంభమేళా' జనవరి 13, 2025 నుండి ఫిబ్రవరి 26 వరకు జరుగబోతోంది. మహా కుంభమేళా యొక్క ముఖ్యమైన తేదీలు 

 1 పౌష్య పూర్ణిమ: 13-01-2025/సోమవారం
 2 మకర సంక్రాంతి 14-01-2025/మంగళవారం మొదటి షాహిస్నానం
 3 మౌని అమావాస్య (సోమవతి) 29-01-2025/బుధవారం, రెండవ షాహిస్నానం
 4 వసంత పంచమి: 03-02-2025/సోమవారం, మూడవ షాహిస్నానం
 5 మాఘీ పూర్ణిమ: 12-02-2025/బుధవారం
 6 మహాశివరాత్రి: 26-02-2025/బుధవారం